Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-May-2016 12:49:22
facebook Twitter Googleplus
Photo

ఇప్పటివరకు హీరోయిన్ నే రిపీట్ చేయని పవన్ కళ్యాణ్.. సడన్ గా రెండోసారి ఆ పని చేశాడని ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి మరో కొత్త స్టార్ను చూసుకోకుండా.. శృతి హాసన్ నే ఎందుకు ఎంపిక చేసినట్లు? కావాలంటే రకుల్ ప్రీత్ లేదా? రాశి ఖన్నా లేదా? పోనివ్ రెజీనాకు ఛాన్స్ ఇవ్వకూడదా? లేకపోతే ఎప్పటిలాగానే బొంబాయి నుండి ఒక కొత్త మోడల్ నో.. అక్కడి హీరోయిన్ నో దించేయొచ్చుగా.

నిజానికి సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా ఫెయిలయ్యాక.. పవన్ కళ్యాణ్ కు కాసింత బాధగా అనిపించిందట. ఎక్కడో ఏదో మిస్సవుతోంది.. ఏది మిస్సవుతోందో తెలియట్లేదు.. అన్నీ జాగ్రత్తగా చూసుకోండి అంటూ నిర్మాత శరత్ మరార్ కు ఈసారి పగ్గాలు అప్పజెప్సేశాడట. దానితో ఆయన.. పవన్ కోసం అన్నీ సెంటిమెంట్లనే ఫాలో అవుతున్నాడు. అందులో భాగంగానే ఎన్నో ఏళ్ళ తరువాత సరైన హిట్టు ''గబ్బర్ సింగ్'' లో భాగ్యలక్ష్మి గా అలరించిన శృతి హాసన్ నే హీరోయిన్ గా తీసుకుందాం అని ఫిక్సయ్యారట. ఏ సమంతో.. తమన్నా నో అయితే.. కోటి లోపే డీల్ వర్కవుట్ అయ్యేది కాని.. పవన్ సినిమా కోసం మళ్ళీ పిలిచారనగానే.. శృతి హాసన్ మాత్రం కోటిన్నర కోట్ చేసి.. అస్సలు దిగి రాలేదు.

బట్.. సెంటిమెంట్ సెంటిమెంటే అనుకున్న శరత్ మరార్.. కాస్త ఎక్కువైనా పర్లేదులే అనుకుని శృతినే ఓకే చేశారట. కేవలం నాగచైతన్య సినిమా ఒక్కటే తన చేతిలో ఉంది.. అయ్యో.. అనుకుంటుంటే.. ఇప్పుడు శృతి అందరికీ ఫైనల్ పంచ్ అలా ఇచ్చింది. మళ్లీ టాప్ స్లాట్ హీరోలంతా వరుసగా ఈమెనే బుక్ చేసినా చేసుకోవచ్చు. అది లెక్క.

,  ,  ,  ,  ,  ,  ,