Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Dec-2015 18:05:10
facebook Twitter Googleplus
Photo

తమిళనాట రెండు మూడు వారాలుగా వరదల గురించి తప్ప వేరే వార్తలే లేవు. సినిమాలు సెలబ్రెటీలకు సంబంధించి కూడా వేరే న్యూస్ ఏమీ లేదు. తారల విరాళాలు.. వారు చేస్తున్న సహాయ కార్యక్రమాల గురించిన వార్తలే దర్శనమిస్తున్నాయి. ఐతే నిన్నట్నుంచి వరదలు-సహాయ కార్యక్రమాల వార్తలు పక్కకెళ్లిపోయాయి. యూట్యూబ్ లో హీరో శింబు - మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పేర్ల మీద వచ్చిన ఓ వీడియో పెద్ద వివాదాన్నే రాజేసింది. అమ్మాయిల చేతిలో మోసపోయిన అబ్బాయిలు.. వాళ్లను తిట్టిపోయడం సరికాదన్న మెసేజ్ తో తయారు చేసిన పాట అది. ఐతే చివరికి ఇచ్చిన సందేశం సంగతి పక్కనబెడితే.. దాని మాటున అమ్మాయిల్ని బూతులు తిట్టేశారు. ఈ లిరిక్స్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మహిళా సంఘాలు మండిపడ్డాయి. సాయంత్రం శింబు - అనిరుధ్ లపై పోలీస్ స్టేషన్లలో కంప్లయింట్లు ఇచ్చేయడం.. కేసులు నమోదు చేయడం కూడా చకచకా జరిగిపోయాయి.

కానీ ట్విస్టు ఏంటంటే.. ఈ పాటతో నాకు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదంటూ శింబు అనిరుధ్ చేతులు దులిపేసుకుంటుండటం. తన కొడుకు శింబు ఊర్లో లేడని.. అందుకే తాను స్పందిస్తున్నానని టి.రాజేందర్ పెద్ద పత్రికా ప్రకటన ఒకటి ఇచ్చాడు. ఈ పాట అనిరుధ్ కంపోజ్ చేశాడని.. శింబుకి ఏ సంబంధం లేదని.. ఈ పాటను తన కొడుకు ఏ సినిమాలో కూడా వాడలేదని.. కాబట్టి అతడికేమీ సంబంధం లేదని పేర్కొన్నాడు రాజేందర్. ఐతే ఫారిన్లో చెన్నై వరద బాధితుల కోసం ఓ షో చేస్తున్న అనిరుధ్ కూడా ఈ పాట విషయంలో అక్కడి నుంచే ఓ మెసేజ్ ఇచ్చాడు. అతను శింబు పేరేమీ ఎత్తలేదు కానీ.. తనకు ఆ పాటకు ఏ సంబంధం లేదనే చెప్పాడు. తాను ఆ పాట రాయలేదని.. కంపోజ్ చేయలేదని.. పాడలేదని.. తన పేరు దాంతో ముడిపెట్టొద్దని చెప్పాడతను. మరి ఇంతకీ ఆ పాట క్రెడిట్ ఎవ్వరిది? ఈ గొడవంతటికీ కారణం ఎవరన్నదే తెలియడం లేదు.

,  ,  ,  ,