Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Aug-2017 11:58:39
facebook Twitter Googleplus
Photo

రెండు వారాల కిందట తన స్వీయ దర్శకత్వంలో ఒక సినిమాను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు తమిళ కాంట్రవర్శల్ హీరో శింబు. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా తమిళ జనాల్లో క్యూరియాసిటీ ఏర్పడింది. ఈ చిత్రానికి సంతోష్ శివన్ లాంటి లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండటం మరింతగా ఆసక్తి రేకెత్తించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంతోష్ శివన్ ఈ సినిమా కథ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడాడు కూడా. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా.. ఈ సినిమా స్క్రిప్టు విన్న వెంటనే.. షూటింగ్ కంటే ముందే నేపథ్య సంగీతం కూడా పూర్తి చేసేశాడట.

ఈ వార్తలన్నీ అతిగానే అనిపిస్తున్నాయి ‘శింబు’ సినిమాకు సంబంధించి తాజా సమాచారం ఏంటంటే.. ఈ చిత్రం తెరకెక్కుతున్నది తమిళంలో కాదట. ఇది పూర్తి స్థాయి ఇంగ్లిష్ సినిమా అట. తన సినిమా ఇంగ్లిష్-తమిళ భాషల్లో తెరకెక్కుతున్నట్లు వస్తున్న వార్తలు కరెక్ట్ కాదని.. దీన్ని తాను ఇంగ్లిష్ లో మాత్రమే తీస్తున్నానని.. తర్వాత తమిళం.. ఇతర భాషల్లోకి అనువాదం చేస్తానని ప్రకటించాడు శింబు. విశేషం ఏంటంటే ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ మాటలు రాస్తున్నాడట. శింబుతో రెండు సినిమాలు (ఏమాయ చేసావె.. సాహసం శ్వాసగా సాగిపో తమిళ వెర్షన్లు) చేసిన గౌతమ్ మీనన్.. శింబు దర్శకత్వం వహించే సినిమాకు ఇంగ్లిష్ లో మాటలు రాయడం విశేషమే. శింబు ఇంతకుముందు స్వీయ దర్శకత్వంలో ‘వల్లభ’ సినిమా చేశాడు. అది ఫ్లాప్ అయింది.

,  ,  ,  ,  ,