Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jun-2016 16:45:58
facebook Twitter Googleplus
Photo

బాహుబలి మూవీ మన దగ్గర సంచలనాలు సృష్టించాక.. ఇతర భాషల్లోకి - ఇతర దేశాలకు వెళ్లింది. అఫ్ కోర్స్.. ఇంకా వెళుతోంది కూడా. వచ్చే నెలలో చైనీస్ వెర్షన్ రిలీజ్ కానుంది. తమ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో రియాక్షన్ ని మొదట ఊహించకపోవడంతో అప్పుడు ప్లాన్ చేయలేదు యూనిట్. కానీ ఇప్పడు బాహుబలి 2 విషయంలో మాత్రం.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. అందుకే ఈ సారి మాత్రం స్కెచ్ మార్చింది యూనిట్.

బాహుబలి ది బిగినింగ్ విషయంలో తెలుగు - తమిళ్ - హిందీ వెర్షన్లు మాత్రమే మొదట సిద్ధమయ్యాయి. ఇప్పుడు మాత్రం ఒకేసారి అన్ని భాషల వెర్షన్లను రెడీ చేస్తున్నారు. 'బాహుబలి ది కంక్లూజన్ ను తెలుగు - తమిళ్ - హిందీ లాంటి భారతీయ భాషలతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడ లోకల్ వెర్షన్లతో ఒకేరోజు రిలీజ్ చేయాలని భావిస్తున్నాం. ప్రస్తుతం 60 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. అక్టోబర్ చివరినాటికి కానీ నవంబర్ ప్రారంభానికి సినిమాను పూర్తి చేసి.. ఏప్రిల్ 2017 రిలీజ్ కు సిద్ధమవుతున్నాం' అటున్నారు నిర్మాత శోభు యార్లగడ్డ.

పూర్తైన సన్నివేశాలకు ఎప్పటికప్పుడు డబ్బింగ్ కార్యక్రమాలను ఫినిష్ చేసేస్తున్నారట. షూటింగ్ కంప్లీట్ అయ్యేనాటికి.. గ్రాఫిక్ వర్క్ తప్ప వేరే ఏ పనీ పెండింగ్ లేకుండా చూడాలన్నది రాజమౌళి ఆలోచన. అయితే ఇంటర్నేషనల్ వెర్షన్స్ సిద్ధమైనా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడం.. అక్కడి డిస్ట్రిబ్యూటర్లపై ఆధారపడి ఉంటుందని బాహుబలి యూనిట్ అంటోంది.

,  ,  ,  ,  ,