Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Nov-2015 16:27:42
facebook Twitter Googleplus
Photo

సోనాల్ చౌహాన్ కెరీర్ లో మంచి హిట్లే ఉన్నాయి. లెజెండ్ - పండగ చేస్కో మూవీలతో హిట్స్ కొట్టి. తాజాగా షేర్ తో దెబ్బ కొట్టించుకుంది సోనాల్. అయితే.. సినిమా ఏదైనా వంపుసొంపులను ఒలకబోయడానికి బికినీతో దర్శనమిస్తుంది ఈ భామ. ప్రేక్షకులను తన అందాలతో బాగానే మురిపిస్తుంది.

లేటెస్ట్ గా రిలీజ్ అయిన షేర్ డిజాస్టర్ గా మిగిలినా.. త్వరలో సైజ్ జీరోతో మరోసారి అందాల విందు చేయబోతోంది. ఇందులోనూ మళ్లీ ఎలాగూ బికినీ వేసి బ్యూటీని పంచుతుంది ప్రేక్షకులకి. ఆ తరువాత బాలయ్య సరసన డిక్టేటర్ లో కూడా రెచ్చిపోనుంది. అయితే.. ఇన్ని మంచి సినిమాలు లిస్ట్ లో ఉన్నా.. ఇప్పటివరకూ తగిన గుర్తింపు కానీ పేరు కానీ సోనాల్ చౌహాన్ కి రావడం లేదు. ఇందుకు కారణం అమ్మడి ప్లాస్టిక్ యాక్టింగే అని చెప్పాలి. ఆరబోత మీద పెట్టిన శ్రద్ధ.. యాక్టింగ్ పై పెట్టడం లేదంటున్నారు ఆమెతో సినిమా తీసినవాళ్లు.

మొహమాటం లేకుండా ఎక్స్ పోజింగ్ చేయడంతో ఛాన్సులు బాగానే వస్తున్నా.. ఇది ఎక్కువ కాలం ఉండదనే విషయాన్ని అమ్మడు పట్టించుకోవడం లేదు. కెరీర్ లో తనకంటూ చెప్పుకోదగ్గ పెర్ఫామెన్స్ ఉంటేనే కెరీర్ కంటిన్యూ అవుతుంది. లేకపోతే.. ఇంక చూడ్డానికి చూపించడానికి ఏముంది అని పక్కన పెట్టేసే ప్రమాదం ఉందంటున్నారు టాలీవుడ్ జనాలు. వింటున్నావా సోనాల్?

,  ,  ,