Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Nov-2016 15:09:43
facebook Twitter Googleplus
Photo

కె.రాఘవేంద్రరావు కథానాయిక అనిపించుకోవాలంటే ఎంతో అదృష్టం కావాలి. నిన్నటితరం కథానాయికలైతే ఆయనతో పనిచేసే అవకాశం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసేవాళ్లు. ఈమధ్య దర్శకేంద్రుడు స్పీడు తగ్గించాడు కాబట్టి అప్పుడప్పుడు ఒకరిద్దరు కథానాయికలకి మాత్రమే ఆ అవకాశం దక్కుతోంది. తాజాగా కొత్తమ్మాయి ప్రగ్యా జైశ్వాల్ కి ఆ అవకాశం దక్కింది. ఓం నమో వేంకటేశాయలో అనుష్క - విమలారామన్ లతో కలిసి తెరను పంచుకొంటోందామె. కె.రాఘవేంద్రరావు మార్క్ గ్లామర్ మాత్రం ప్రగ్యా చేస్తున్న పాత్రలోనే కనిపించబోతోందట.

ఆమె కోసం దర్శకేంద్రుడు ప్రత్యేకంగా వస్త్రాలు డిజైన్ చేయించి సినిమాలో వాడుతున్నారు. తాజాగా 14.5 కిలోల బరువున్న ఓ డ్రెస్ ని ధరించి ప్రగ్యా జైశ్వాల్ ఆడిపాడింది. సినిమాకి ఆ గౌను ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట. రుక్మిణి అనే కాస్ట్యూమ్ డిజైనర్ ఆ గౌనును సిద్ధం చేసింది. బంగారు వర్ణంలో ఉండే ఆ గౌనులో ప్రగ్యా ధగధగ మెరిసిపోతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ డ్రెస్సు కోసం నిజమైన బంగారంనే వినియోగించినట్టు తెలిసింది. అసలే బంగారంలా మెరిసిపోయే ప్రగ్యా బంగారుపు దుస్తుల్ని ధరించిందంటే ఆ మెరుపులు రెట్టింపవడం ఖాయం. అయితే అంత బరువైన ఆ గౌను ధరించి డ్యాన్స్ వేయడానికి మాత్రం ప్రగ్యా చాలా కష్టపడిందట. సంక్రాంతికి విడుదల చేయడమే లక్ష్యంగా ఓం నమో వేంకటేశాయ చిత్రాన్ని శరవేగంగా షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున హథీరాం బాబాగా కనిపించనున్నారు

,  ,  ,  ,  ,