Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Aug-2017 15:11:19
facebook Twitter Googleplus
Photo

సినిమా హిట్టయ్యాక.. ఏదన్నా కొత్త లాంగ్వేజ్ లో సినిమాను రిలీజ్ చేసి క్రేజు తెచ్చుకోవాలని దాదాపు పెద్ద హీరోలందరూ చూస్తున్నారు. అందుకే అందరూ ఏదో ఒక బాషలోకి సినిమాను డబ్ చేయిస్తున్నారు. అయితే తెలుగు స్టార్లలో చాలామంది కేవలం తమిళం మలయాళం వంటి బాషలకు మాత్రమే ఈ డబ్బింగ్ పరిమితం చేస్తారు కాని.. ఇప్పుడు మహేష్బాబు మాత్రం కొత్త పుంతలు తొక్కుతున్నాడు.

మీకు గుర్తుందా.. అప్పట్లో మహేష్ బాబు అతడు సినిమా ఇక్కడ రిలీజై ఫ్లాపైంది కాని.. పోలిష్ బాషలో పోలాండ్ దేశంలో రిలీజై పెద్ద హిట్టయ్యింది. అలా అప్పుడప్పుడూ కొత్త ఫీట్లు చేసే మహేష్ ఇప్పుడు స్పైడర్ సినిమాను కూడా అలాంటి ఒక కొత్త బాషలోకి డబ్ చేయిస్తున్నాడట. ఎలాగో యాక్షన్ ఎడ్వంచర్ కాబట్టి.. యునివర్సల్ అప్పీల్ ఉన్న కంటెంట్ కాబట్టి.. ఇప్పుడు అరబిక్ బాషలోకి ఈ సినిమాను డబ్బింగ్ చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో తెలుగు హింది వర్షన్లతోపాటు అరబిక్ వర్షన్ కూడా రిలీజ్ చేస్తారట.

ఇకపోతే సెప్టెంబర్ 27న స్పైడర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ఈ సినిమాతో తొలిసారిగా మహేష్ అండ్ మురుగుదాస్ కాంబో రానుండగా.. తొలిసారి రకుల్ ప్రీత్ సూపర్ స్టార్ తో రొమాన్స్ చేస్తోంది.

,  ,  ,  ,  ,