Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Aug-2017 11:18:50
facebook Twitter Googleplus
Photo

మూడు సినిమాలను రిలీజ్ చేసే సత్తా మన బాక్సాఫీస్ కు ఉంది కాని.. రిలీజైన ప్రతి సినిమాతోనూ హిట్టు కొట్టాలంటే మాత్రం అవతల స్టార్ హీరోలు ఉండాల్సిందే. అలా కాకుండా కేవలం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స్టార్లు ఉంటే మాత్రం.. అందరూ కలసి మజ్జికలో వాటర్ కలుపుకుని తాగాల్సిందే. అయితే ఇప్పుడు దసరా సందర్భంగా కూడా ఇలాంటి క్లాష్ ఒకటి చూడబోతున్నామా?

నిజానికి సెప్టెంబర్ 1న పైసా వసూల్.. 8న యుద్దం శరణం.. 21న జై లవ కుశ.. 27న స్పైడర్.. ఇలా సాగనుంది దసరా సందడి. అయితే ఇప్పుడు మహేష్ బాబు స్పైడర్ సినిమా వచ్చేసరికి ఇన్నేసి సినిమాలు లైన్లో ఉంటే.. మరి ధియేటర్ల కొరత రాదా? అందుకే ఈ సినిమా తెలుగు వర్షన్ నిర్మాత ఠాగూర్ మధు ఇప్పుడు ఆగస్టు 11న జరిగిన క్లాష్ ను చూసి ముందుగానే ఒక స్టెప్ వేశాడట. అదేంటంటే.. ఆల్రెడీ స్పైడర్ సినిమా కోసం ధియేటర్లతో ఎగ్రిమెంట్లు అయిపోతున్నాయి. ఎన్ని సినిమాలు వచ్చినా ఏవి రాకపోయినా.. ఎవరు ఎన్ని ధియేటర్లు తీసుకున్నా కూడా.. స్పైడర్ కోసం మాత్రం ఆల్రెడీ భారీ సంఖ్యలో ధియేటర్లను పక్కకు సర్దేశారు. ఆ విషయంలో ప్లాన్ పక్కాగా సెట్ చేసుకున్నారట. దాని వలన సినిమా కలక్షన్లకు ఏ విధంగానూ గండిపడే అవకాశం ఉండదు.

ఇప్పటికే మహేష్ బాబు స్పైడర్ సినిమాను మురుగుదాస్ చాలా డిఫరెంట్ తరహాలో రూపొందిస్తున్నాడని మొన్నటి టీజర్ చూస్తే తెలిసిందే. అలాగే బూమ్ బూమ్ సాంగ్ చూశాక ఈ సినిమాపై హైప్ ఇంకాస్త ఎక్కువైంది. మనోడు ఈసారి మాస్ ఎలిమెంట్స్ లేకుండా రజనీకాంత్ రోబో తరహాలో క్లాస్ అండ్ ఫ్యామిలీస్ ను గట్టిగా టార్గెట్ చేశాడని ఇన్సయిడ్ టాక్.

,  ,  ,  ,  ,  ,