Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Feb-2015 14:53:18
facebook Twitter Googleplus
Photo

సమంతా చేయాల్సిన సినిమాని శ్రీదివ్య చేస్తోంది. 'బెంగళూర్ డేస్' తెలుగు, తమిళ రీమేక్ లో తాజాగా ఈ సుందరిని ఎంచుకున్నారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో ప్రధాన కథానాయిక పాత్రకు మొదట్లో సమంతాను తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, ఆమె హఠాత్తుగా ఈ ప్రాజక్టు నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో శ్రీదివ్యను తీసుకున్నారు.

'బస్టాప్', 'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' వంటి తెలుగు సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది ఆ వెంటనే తమిళంలో పలు సినిమాలు చేసి, అక్కడ పెద్ద స్టార్ అయిపోయింది. తను ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో నటిస్తున్న హీరోయిన్ కావడంతో ఆమె ఇమేజ్ తమకు ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో 'బెంగళూర్ డేస్' రీమేక్ కి ఈమెను తీసుకున్నారట.

,  ,  ,  ,  ,