Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Nov-2016 13:05:43
facebook Twitter Googleplus
Photo

తెలంగాణ రాష్ట్రం సిద్ధించేందుకు ముందు.. ఉమ్మడి ఏపీలో జరిగిన పరిస్థితులను టచ్ చేసేందుకు సినిమా వాళ్లు అంతగా సాహసించరు. ఎటువైపు మొగ్గినా రెండో ప్రాంతం నుంచి వ్యతిరేకత వస్తుందనే భయం.. కలెక్షన్స్ పై ఇది ప్రభావం చూపితే నష్టపోయే అవకాశం ఉండడంతో.. ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ ని టాలీవుడ్ జనాల లైట్ తీసుకున్నారు.

కానీ ఆంధ్రా-తెలంగాణ అన్న కాన్సెప్ట్ కి లవ్ స్టోరీని మిక్స్ చేసి.. మొదటిసారిగా ఆనాటి పరిస్థితులను బేస్ చేసుకుని 'జయమ్ము నిశ్చయమ్మురా' తెరకెక్కింది. సినిమా కోసం 2013నాటి పరిస్థితులను రీక్రియేట్ చేస్తున్నారు. కమెడియన్ శ్రీనివాస రెడ్డి హీరోగా.. పూర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో.. కరీంనగర్ పోరడిగా హీరో పాత్ర- కాకినాడ అమ్మాయిగా హీరోయిన్ రోల్ ఉంటాయి. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉండే 2013నాటి సిట్యుయేషన్స్ ను.. ఈ ప్రేమకథలో సున్నితంగా తీశామని చెబుతున్నారు జయమ్ము నిశ్చయమ్మురా యూనిట్.

ఎన్నారైలు.. తమిళమ్మాయిలు.. బెంగాలీ బాబులు లాంటి చాలా థీమ్ లు తెలుగు సినిమా తెరపై కనిపించాయి కానీ.. మొదటిసారిగా ఇలా ఏపీ-తెలంగాణ జంట టాలీవుడ్ స్క్రీన్ కనిపించబోతోంది. గతంలో ఓసారి 'ఆంధ్రా పోరి' అంటూ ఆకాష్ పూరి సినిమా ఒకటి వచ్చింది కానీ.. మరాఠి మూవీ టైమ్ పాస్ రీమేక్ కి.. ఇక్కడ ఆసక్తి కలిగించడానికి తప్ప.. ఆ టైటిల్ కి సినిమాకి సంబంధం ఉండదు

,  ,  ,  ,  ,  ,  ,