Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Nov-2016 11:47:22
facebook Twitter Googleplus
Photo

బ్లాక్ మనీపై యుద్ధం అంటూ మోడీ వేసిన పంచ్ చాలా ఇండస్ట్రీలనే తాకింది. ఈ జాబితాలో సినిమా పరిశ్రమ కూడా ఉందనే విషయం ఒప్పుకోవాల్సిందే. కలెక్షన్స్ దగ్గర నుంచి షూటింగ్స్ వరకూ అన్ని రకాలు ఈ ప్రభావం కనిపించింది. ఇది ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్య అయితే.. ఫ్యూచర్ లో ఇంకో పెద్ద ప్రాబ్లెం ఎదురు కానుంది. అది ఇండస్ట్రీకి మంచి చేసేది కాగా.. స్టార్లకు మాత్రం పెద్ద పంచ్ పడే ఛాన్స్ ఉంది.

టాలీవుడ్ స్టార్ హీరోలు దాదాపు 20 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంటే.. స్టార్ డైరెక్టర్లు 10కోట్లు దాటిపోయారు. బాలీవుడ్ లో 40-50 కోట్లు వసూలు చేసే హీరోలు కూడా ఉన్నారు. అయితే.. ఇవన్నీ పైకి చెప్పే ఫిగర్స్ మాత్రమే. ఇదంతా అగ్రిమెంట్స్ లో కానీ.. వైట్ చెల్లింపులు కానీ సాధారణంగా ఉండవు. ముందు మాటల్లోనే ఎంత బ్లాక్.. ఎంత వైట్ అనే సంగతి కూడా మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో.. బ్లాక్ మనీ ఇచ్చే ఛాన్స్ నిర్మాతలకు ఉన్నా.. తీసుకునే అవకాశం స్టార్లకు లేదు.

మొత్తం వైట్ చెల్లించమంటే.. రెమ్యూనరేషన్ తగ్గించమని ఒత్తిడి చేసే ఛాన్స్ ఉంటుంది. ఏతావాతా పారితోషికాలు తగ్గిపోయి.. సినిమా నిర్మాణ ఖర్చులు తగ్గుతాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది సినిమా ఇండస్ట్రీకి మేలు చేయనుండగా.. కోట్లు పిండుకునే స్టార్లకు మాత్రం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

,  ,  ,  ,  ,  ,