Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2016 12:00:11
facebook Twitter Googleplus
Photo

రజనీ కాంత్ అభిమానులు గత కొద్దిరోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. ఆయన హీరోగా నటించిన గ్యాంగ్‌స్టర్ సినిమా అయిన ?కబాలి? సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను ఈ ఉదయం విడుదల చేశారు. ఇక ఈ టీజర్ ఇలా విడుదలైందో లేదో, దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో టీజర్ ప్రభంజనం సృష్టిస్తూ దూసుకెళుతోంది. విడుదలైన గంటకే ఈ సినిమా 10 లక్షల వ్యూస్ సాధించిందంటే సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పష్టమవుతోంది.
తమిళంలో రియలిస్టిక్ సినిమాలతో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సెట్ చేసుకున్న పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏ స్థాయిలో ఉండనుందో టీజర్ స్పష్టం చేసింది. రజనీకాంత్ డైలాగ్ డెలివరీ, స్టైల్, సంతోష్ నారాయణ్ అదిరిపోయే బ్యాంక్‌గ్రౌండ్ మ్యూజిక్.. అన్నీ కలిపి ఈ టీజర్‌ను టాప్ క్లాస్‌గా నిలబెట్టాయి. ఇక ఈ టీజర్‌కు అభిమానులు, ప్రేక్షకుల దగ్గర్నుంచే కాకుండా సినీ ప్రముఖుల దగ్గర్నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ?బాహుబలి?తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయిన రాజమౌళి, రజనీ టీజర్ అంటే ఇదీ అంటూ కబాలి టీజర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక ?రోబో 2.0? సెట్లో రజనీతో కలిసి టీజర్‍ను చూసిన శంకర్ కూడా టీజర్‌కు ఫిదా అయిపోయారట. ఇక ఈ టాప్ దర్శకులే కాక మిగతా దర్శకులు, హీరోలూ.. అంతా రజనీ స్టైల్‌కి ముగ్ధులైపోవడం విశేషంగా చెప్పుకోవాలి. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను కళైపులి థాను నిర్మించారు. రజనీ ఓ వయసైన గ్యాంగ్‌స్టర్‌గా నటించిన ఈ సినిమా, జూన్ మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

,  ,  ,  ,  ,  ,  ,  ,