ఆల్రెడీ జ్యో అచ్యుతానంద సినిమా మీద పాజిటివ్ బజ్ ఉంది ఇండస్ట్రీలో. ఈ సినిమా గురించి ఒక్కొక్కరు చెబుతున్న మాటలు చూస్తుంటే అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఆల్రెడీ నాని.. ఆల్ ది బెస్ట్ కాకుండా ?కంగ్రాచులేషన్స్ చెప్పాడు జ్యో అచ్యుతానంద టీంకి. రాజమౌళి సైతం ఇది సూపర్ హిట్ సినిమా అన్నాడు. తాజాగా సుకుమార్ కూడా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు.
సుక్కు ఈ సినిమా చూడలేదట కానీ.. స్క్రిప్టు చదివాడట. ఐతే క్లైమాక్స్ చదవగానే తాను కదిలిపోయానని.. కన్నీళ్లు పెట్టేసుకున్నానని సుకుమార్ చెప్పాడు. అవసరాల శ్రీనివాస్ అందమైన స్క్రిప్టు రాశాడని.. అతడి శైలి తనకెంతో నచ్చుతుందని చెప్పాడు సుకుమార్. ?జ్యో అచ్యుతానంద? ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని సుకుమార్ అన్నాడు.
ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది ?జ్యో అచ్యుతానంద?. దర్శకుడిగా తన తొలి సినిమా ?ఊహలు గుసగుసలాడే?తో పోలిస్తే ?జ్యో అచ్యుతానంద? భిన్నంగా ఉంటుందని.. ఇది ప్రధానంగా ఎమోషన్ల మీద నడిచే సినిమా అని అంటున్నాడు అవసరాల. అన్నదమ్ములుగా నారా రోహిత్-నాగశౌర్య అద్భుతంగా నటించారని.. రెజీనా కూడా చక్కటి పెర్ఫామెన్స్ ఇచ్చిందని అని అవసరాల చెబుతున్నాడు. సాయికొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి కళ్యాణ రమణ సంగీతాన్నందించాడు.