Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-May-2017 11:47:14
facebook Twitter Googleplus
Photo

ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన సుకుమార్.. ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా సెకండ్ షెడ్యూల్ కూడా మొదలుపెట్టిన ఈ దర్శకుడు.. నిర్మాతగా కూడా ఓ మూవీని రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. కుమారి 21ఎఫ్ తో ప్రారంభించిన సుకుమార్ రైటింగ్స్ ను కంటిన్యూ చేస్తూ.. ఇప్పుడు దర్శకుడు అనే టైటిల్ పై మూవీని కంప్లీట్ చేసేశాడు.

కుమారి విషయంలో సుకుమార్ కొన్ని సలహా సూచనలు ఇచ్చినా.. దర్శకుడు విషయంలో మాత్రం డైరెక్టర్ హరిప్రసాద్ జక్కాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేశాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రీసెంట్ గా పాటల షూటింగ్ తో మొత్తం షూటింగ్ పూర్తయిపోయిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 9న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రొమాంటిక్ జోనర్ లో దర్శకుడు చిత్రం రూపొందగా.. ఓ దర్శకుడి సినీ ప్రయాణం.. ప్రేమ కథ.. ఈ చిత్రానికి థీమ్.

త్వరలో గ్రాండ్ ఆడియో ఫంక్షన్ నిర్వహించబోతున్నారు సుకుమార్ అండ్ టీం. ఈ ఫంక్షన్ కు ఓ స్టార్ హీరో చీఫ్ గెస్ట్ గా వస్తాడని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,