Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Feb-2016 17:44:04
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ ఎన్టీఆర్- మాథ్స్ మాస్టర్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో చిత్రాన్ని లండన్ లో చాలా భాగం షూట్ చేశారు. ఇక్కడ కూడా రోడ్లపై చేసిన షూటింగ్ చేసినదే చాలా ఎక్కువ. హీరోయిన్ ఎన్టీఆర్ పడేసే సన్నివేశాల్లో భాగంగా.. రోడ్లపై రకుల్ కార్ డ్రైవ్ చేసుకుంటే వెళ్లే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఈ సమయంలో రకుల్ దారి తప్పిపోవడంతో నానా హంగామా జరిగిందట. ఈ విషయం ఆల్రెడీ మనకు తెలిసిందే కాని.. ఇప్పుడు సుకుమార్ ఒక ఇంటర్యూలో దీని గురించి ప్రత్యేకంగా చెప్పడంతో మరోసారి చెప్పుకోవాల్సి వచ్చింది.

షూటింగ్ లో భాగంగా కెమేరా అమర్చిన కారును రకుల్ సింగిల్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఓ చోట రైట్ టర్నింగ్ తీసుకోవాల్సి ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం లెఫ్ట్ కు కట్ తీసుకుని వెళ్లిపోయిందని చెప్పాడు డైరెక్టర్ సుకుమార్. ఆమె దగ్గర సెల్ ఫోన్ కూడా లేకపోవడం వాకీటాకీతో కనక్షన్ కట్ అయిపోవడంతో.. అందరూ కంగారు పడిపోయారని చెప్పాడు. ఇక రకుల్ సంగతి అయితే చెప్పనక్కర్లేదు.

కారులోనే కంగారు పడిపోతూ... రకుల్ చేసిన హడావిడి మొత్తం పిక్చరైజ్ అయింది. 'డామిట్' అంటూ ఆమె అసహనం వ్యక్తపరచడం.. చాలా సేపటి తర్వాత మళ్లీ వాకీటాకీకి కనెక్షన్ రావడంతో.. మొత్తానికి కథ సుఖాంతం అయింది. అయితే.. రకుల్ తప్పిపోయిన సన్నివేశం గురించి తర్వాత అందరూ నవ్వుకున్నా.. ఆ టైంలో మాత్రం చాలా భయపడ్డారట. మొత్తానికి లండన్ రోడ్లపై రకుల్ పెట్టిన కేకలు మాత్రం.. అందరికీ బాగా గుర్తుండిపోయాయి.. అంటున్నాడు సుకుమార్.

,  ,  ,