Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Nov-2016 11:37:41
facebook Twitter Googleplus
Photo

సుమంత్-కీర్తి రెడ్డిలది మంచి జంట అవుతుందనుకున్నారు అందరూ. కానీ పెళ్లయిన రెండేళ్లకే ఆ జంట విడిపోవడం పెద్ద షాకే. ఆ తర్వాత సుమంత్ మరో పెళ్లి చేసుకోలేదు. కీర్తి రెడ్డి మాత్రం వేరే పెళ్లి చేసుకుని స్థిరపడింది. మామూలుగా అయితే విడాకులు తీసుకున్నాక ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం తక్కువ. కానీ తనకు మాత్రం కీర్తితో మంచి సంబంధాలే ఉన్నాయని.. తనతో తరచుగా మాట్లాడుతుంటానని చెబుతున్నాడు సుమంత్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కీర్తితో తన రిలేషన్.. ఆమెతో విడిపోయాక తన జీవితం గురించి ఆసక్తికర సంగతులు చెప్పాడు సుమంత్.

??2004లో నా పెళ్లయింది. 2006లో విడిపోయాం. ఐతే కీర్తితో నాకు ఇప్పటికీ మంచి రిలేషన్ షిప్ ఉంది. ఆమె పెళ్లయ్యాక బెంగళూరులో సెటిలైంది. తన మ్యారీడ్ లైఫ్ చాలా బాగుంది. చాలా మంచి కుటుంబం. తనతో ఇప్పటికీ తరచుగా మాట్లాడుతుంటాం. మా మధ్య మంచి రిలేషన్ ఉంది. నాకు మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఒక దశ దాటాక ఒక ఫేజ్ వస్తుంది. మనతో మనం చాలా కంఫర్టబుల్ గా ఉంటాం. ప్రస్తుతం నా పరిస్థితి కూడా అంతే. నాతో నాకు సౌకర్యంగా ఉంది. నేను.. నా ఇల్లు.. నా కుక్కలు.. నా స్నేహితులు.. నా చెల్లెలు.. ఇలా అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే పెళ్లి చేసుకోవాలని ఎంతమాత్రం లేదు. నేను అందరి పెళ్లిళ్లకూ వెళ్తా. నా పెళ్లికి తప్ప. భవిష్యత్తులో ఆలోచనేమైనా మారొచ్చేమో. నాకు ఇంతకుముందు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్లు. ప్రస్తుతం ఎవరూ లేరు. ఫ్యూచర్లో ఎవరైనా రావచ్చేమో?? అంటూ చాలా ఓపెన్ గా మాట్లాడేశాడు సుమంత్.

,  ,  ,  ,