Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Nov-2016 11:13:11
facebook Twitter Googleplus
Photo

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ కి 'నరుడా డోనరుడా' మూవీ పెద్ద షాక్ నే ఇచ్చింది. అప్పటికే బాలీవుడ్ లో క్లిక్ అయిన కాన్సెప్ట్.. తెలుగు ఆడియన్స్ కు అంతగా తెలియని సబ్జెక్ట్.. అన్నిటికీ మంచి ఫుల్ లెంగ్త్ ఎంటర్టెయినర్.. ఓ సినిమా సక్సెస్ అయేందుకు ఇంతకంటే ఎక్కువగా ఏమీ అవసరం లేదు. అన్నీ ఉన్నా సరే.. డోనరుడు మాత్రం హిట్ కొట్టలేకపోయాడు.

2007లో మధుమాసం తో సక్సెస్ రుచి చూసిన సుమంత్.. డోనరుడు లోపు 8 సినిమాలు చేయగా.. అన్నీ డిజాస్టర్లే. ఇప్పుడు ఎంత టైట్ బడ్జెట్ తో డోనరుడుని పూర్తి చేసినా.. ఇది కూడా ఫ్లాప్ గానే మిగిలింది. చాలా థియేటర్లలో కనీసం ఖర్చులు వసూలయ్యేలా కూడా ఆడియన్స్ రాకపోవడం ఆశ్చర్యకరం. ఇప్పటికే తను విలన్ రోల్స్ వైపు ఇంట్రెస్టింగ్ గా ఉన్నానని చెప్పడంతో.. ఇక కేరక్టర్ ఆర్టిస్టుగా కొనసాగేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం బెటర్ అనే సలహాలు వినిపించేస్తున్నాయి.

నరుడా డోనరుడా చిత్రంతో.. సుమంత్ కెరీర్ తిరిగి గాడిలో పడుతుందని అనుకుంటే.. దాదాపుగా ఈ హీరో కెరీర్ కి శుభం కార్డ్ పడిపోయినట్లు అయింది పరిస్థితి. ఇప్పుడున్న సిట్యుయేషన్ లో జగపతిబాబు.. శ్రీకాంత్ లాంటి సీనియర్లను ఫాలో అయిపోవడమే బెటర్ అనేస్తున్నారు సినీ జనాలు.

,  ,  ,  ,  ,