Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Mar-2017 11:52:54
facebook Twitter Googleplus
Photo

తమిళ హీరో కార్తికి తెలుగులో ఆవారా సినిమా మంచి ఆరంభాన్నిస్తే.. అతడికి మరింత మంచి ఫాలోయింగ్ వచ్చేలా చేసిన సినిమా నా పేరు శివ. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమా అప్పట్లో తెలుగులోనూ మంచి విజయం సాధించింది. టీవీలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ఎప్పుడు షో పడ్డా జనాలు ఆసక్తిగా చూస్తుంటారు. చాలా సింపుల్ గా ఉంటూనే బలమైన ముద్ర వేస్తుందీ సినిమా. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుండటం విశేషం. కానీ ఆ చిత్రంలో హీరో కార్తి కాదు. మన తెలుగు హీరో సందీప్ కిషన్. నా పేరు శివ (తమిళంలో నాన్ మహాన్ అల్లా) దర్శకుడు సుశీంద్రనే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

తెలుగులో వరుసగా ఎదురు దెబ్బలు తిన్న సందీప్ కిషన్.. కొన్నాళ్లుగా తమిళ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. అతను ఒకేసారి అక్కడ మూడు సినిమాలు కమిటయ్యాడు. అందులో ఒకటి నగరం. అది ఈ రోజే ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరోవైపు నిర్మాణం నుంచి దర్శకత్వంలోకి వచ్చిన సీవీ కుమార్ తో మాయవన్ అనే ఇంకో థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు సందీప్. దీంతో పాటుగా సుశీంద్రన్ దర్శకత్వంలో సినిమా కూడా గత ఏడాదే మొదలుపెట్టాడు. ఈ చిత్రం కూడా పూర్తి కావస్తోంది. ఇది నా పేరు శివ లైన్లో ఉండే సినిమా అని.. దానికి కొనసాగింపులా ఉంటుందని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో సుశీంద్రన్ తెలిపాడు

,  ,  ,  ,  ,