Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Aug-2016 13:22:48
facebook Twitter Googleplus
Photo

సునీల్ మంచి క‌మెడియ‌న్‌. బ్రహ్మానందం తర్వాత బెస్ట్ ఆప్షన్. ఇందులో ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయితే ఇది గతం. ఇప్పుడు సునీల్ హీరో అయిపోయాడు. వరుసగా ఓ రెండు హిట్లు కూడా పడ్డాయి. అయితే ఆ తర్వాతే స్టార్ అయ్యింది బ్యాడ్ టైం. హీరోగా సునీల్ కు ఇప్పుడు విజయాలు లేవు. గత కొన్నాళ్ళుగా ఓ హిట్టు కోసం తెగ ఆరాట‌ప‌డుతున్నాడు సునీల్‌.

అయితే దర్శకులు తయారుచేసుకునే పాత్రలు ఆయనకి సెట్ కావడం లేదన్నది నిర్విదాంశం. బేసిగ్గా సునీల్ ది కామెడీ ఫేసు. కానీ.. సిక్స్ ప్యాక్ తెచ్చుకొని యాక్ష‌న్ ఇమేజ్ కూడా కొట్టేద్దామ‌ని ట్రై చేశాడు. కానీ అవేం వ‌ర్క‌వుట్ కాలేదు. అన్నీ ఆర్టిఫిషియల్ గా వుంటున్నాయి.

తాజాగా వచ్చిన జక్కన్న కూడా ఫాప్లు దారే పట్టింది. తెగ నవ్వించేయాలని తాపత్రయం పడ్డాడేకానీ.. కితకితలు పెట్టుకొని నవ్వుకోవాల్సిన పరిస్థితి. ఆయన బిల్డ‌ప్పులు, బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ కి అస్సల్ మ్యాచ్ కావడం లేదు. హీరోగా సునీల్ కి వరుసగా ఇది నాలుగో ఫ్లాపు. పరిస్థితి ఇలానే కొనసాగితే సునీల్ కెరీర్ కు కష్టకాలం తప్పదు.

ముందే చెప్పుకున్నట్లు సునీల్ మంచి క‌మెడియ‌న్‌. చాలా మంది దర్శకుడు సునీల్ తో అద్భుతమైన వినోదాన్ని పడించారు. ఇప్పుడు సునీల్ నుండి అభిమానులు కోరుకుంటుంది ఇదే. హీరోయిజం కాస్త పక్కన పెట్టి కామెడీ చేయమని. సునీల్ కు ఇప్పుడు అవసరం కూడా. ఇప్పుడాయనకు సరికొత్త మేకోవర్ కావలి. ఇలాంటి నేపధ్యంలో సునీల్ ని పూర్తిగా కొత్త గా చూపించే దర్శకుడు ఎవరంటే.. త్రివిక్రమే బెస్ట్ ఆప్షన్ అని వినిపిస్తుంది.

త్రివిక్రమ్ -సునీల్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. పర్శనల్ గా మంచి స్నేహితులు. జులాయి వరకూ త్రివిక్రమ్ రాసిన తీసిన అన్నీ సినిమాల్లో వున్నాడు సునీల్. త్రివిక్రమ్ సినిమా అంటే మంచి నీళ్ళు తాగినంత ఈజీగా వినోదాన్ని పండిస్తాడు సునీల్. ఇప్పుడు త్రివిక్రమే ఓ క్యారెక్టర్ రాసి సునీల్ ను మళ్ళీ స్వింగ్ లోకి తీసుకురావాలి. మరి, ఇది ఎప్పుడు జరుగుతుందో

,  ,  ,  ,  ,