Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Nov-2016 10:42:49
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్లో హీరోయిన్ల కొరత మామూలుగా లేదిప్పుడు. పెద్ద పెద్ద స్టార్లకే హీరోయిన్లను సెట్ చేయడం కష్టమైపోతోంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి వాడికే కథానాయికను ఫిక్స్ చేయడానికి చాలా ఇబ్బందైంది. ప్రస్తుతం రైజింగ్ లో ఉన్న మిగతా స్టార్ హీరోలకూ ఇదే ఇబ్బంది ఉంది. ఇక సునీల్ లాంటి హీరో గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఫ్లాపుల వ్రతం పట్టిన సునీల్ కు ఇప్పుడు హీరోయిన్ని వెతకడం చాలా కష్టమైపోతోంది.

ఈ మధ్యే సునీల్ హీరోగా ?ఎన్ కౌంటర్? శంకర్ ఓ సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇది మలయాళ హిట్ మూవీ ?టు కంట్రీస్?కు రీమేక్. అందులో కథానాయికది కీలక పాత్ర. ఐతే ఆ పాత్ర చేయడానికి సరైన హీరోయిన్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడంతో కాస్త పేరున్న కథానాయికనే తీసుకుందామని చూస్తున్నారు కానీ.. ఎవరూ దొరకట్లేదట. సునీల్ ట్రాక్ రికార్డు చూసి.. హీరోయిన్లు జంకుతున్నట్లు సమాచారం.

సునీల్ గత మూడేళ్లలో చేసిన సినిమాలేవీ ఆడలేదు. ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్ పడేసరికి ప్రతిసారీ హీరోయిన్ల విషయంలో ఇబ్బందే ఎదురవుతోంది. దీంతో సెకండ్ గ్రేడ్ హీరోయిన్లనే ట్రై చేస్తూ వస్తున్నారు. వాళ్లు కూడా ఆ తర్వాత నిలవట్లేదు. ఈ నేపథ్యంలోనే సునీల్ కొత్త సినిమాకు హీరోయిన్ ఇబ్బంది తలెత్తినట్లుంది. మరోవైపు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు కూడా తెలుగులో చేస్తున్న హీరోయిన్లెవరూ దొరకని నేపథ్యంలో తమిళంలో సినిమాలు చేస్తున్న మలయాళ భామ మియా జార్జిని తీసుకొచ్చారు. మరి శంకర్ సినిమాకు ఎవరిని సెట్ చేస్తారో చూడాలి.

,  ,  ,  ,  ,