Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Oct-2015 17:17:42
facebook Twitter Googleplus
Photo

డిస్ట్రిబ్యూటర్ గాను - నిర్మాతగాను దిల్ రాజుకు చాలా మంచి పేరే ఉంది. జడ్జిమెంట్ - అంచనాల్లో మంచి ట్యాలెంట్ ఉన్నోడిగా గుర్తింపు ఉంది. నాకో సినిమా చేస్తావా అని స్వయంగా మెగాస్టార్ తో అడిగించుకునేంత ట్యాలెంట్ ఉన్న ప్రొడ్యూసర్ కం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. ఈ వ్యవహరాల్లో దిల్ రాజుకు శిరీష్-లక్ష్మణ్ లు సహాయంగా ఉంటారు. కానీ ఇప్పుడు దిల్ రాజు అండ్ కోకి షాక్ తగిలింది. ఏసియన్ సినిమాస్ అనే పేరుతో పంపిణీరంగంలో దూసుకుపోతున్న సునీల్ నారంగ్.. ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుపై.. ఫిలిం ఛాంబర్ కు ఓ కంప్లెయింట్ అందింది.

ఫిలిం ఇండస్ట్రీలోని అందరికీ అంటూ టైటిల్ పెట్టి మరీ ఫిలిం ఛాంబర్ కు లేఖరాశారు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ విషయంలో శిరీష్ అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ఈ లెటర్ లో ఫిర్యాదు చేశారు. ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో అడ్వాన్సులు తీసుకుని - కలెక్షన్లు తక్కువ చేసి చూపుతున్నాడన్నది ఇందులోని ప్రధాన ఆరోపణ. ఎదురుతిరిగిన వాళ్లను శిరీష్ బెదిరిస్తున్నాడని కూడా ఆరోపించారు. వీటిని తట్టుకుని నిలబడేందుకు ఏషియన్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ యజమానిగా సునీల్ నారంగ్ కు మాత్రమే సత్తా ఉందని మిగతా వాళ్లు బలైపోతున్నారని లేఖలో రాశారు.

ఈ లేఖను - తెలంగాణ సీఎం - సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ - కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా - తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ - తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు.. ఏపీ తెలంగాణలకు చెందిన ఎగ్జిబిటర్స్ - డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్లకు పంపారు. దిల్ రాజు టీంపై ఇంత స్థాయిలో ఆరోపణలు రావడం అది కూడా లిఖితపూర్వకంగా అందడం ఇదే మొదటిసారి. దీనికి దిల్ రాజు అండ్ కో ఎలా స్పందిస్తుందో?

,  ,  ,  ,  ,