Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Aug-2015 13:16:30
facebook Twitter Googleplus
Photo

డైరెక్టర్ తేజ చివరి హిట్టు ఏదో గుర్తుందా? నీకు నాకు డ్యాష్ దగ్గర్నుంచి అలా అలా వెనక్కి వెళ్తుంటే 1 2 3 4 ఇలా నెంబర్లు డబుల్ డిజిట్ కు చేరిపోతాయి. ఏళ్లకు ఏళ్లు వెనక్కి వెళ్లిపోతాయి. కానీ హిట్టు జాడ తెలియదు. బ్లాక్ బస్టర్ ?జయం? తర్వాత ఆయన నుంచి ఓ మోస్తరు సినిమా కూడా రాలేదన్నది వాస్తవం. అయినా ఇన్నేళ్లు బాగానే నిలబడ్డారు. తన కొత్త సినిమా ?హోరాహోరీ?కి కొంచెం క్రేజ్ తేగలిగారు. అయినప్పటికీ విడుదల సంగతి ఓ పట్టాన తెమలడం లేదు. ఇంతలో అగ్ర నిర్మాత సురేష్ బాబు లైన్ లోకి వచ్చారు. రిలీజ్ డేట్ ఫిక్సయిపోయింది. సెప్టెంబరు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే రోజు ?కొరియర్ బాయ్ కళ్యాణ్? విడుదలవుతున్నప్పటికీ.. పోటీగా ?హోరాహోరీ?ని రిలీజ్ చేయబోతున్నారు.

దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ లో క్వాలిటీగా తీశాడట తేజ. ఈ మధ్యే సినిమా చూసిన సురేష్ బాబుకి తెగ నచ్చేసిందట. వాటా తీసుకోవడానికి ఆయన ముందుకు రావడం.. దామోదర్ ప్రసాద్ అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. సురేష్ బాబు బ్రాండ్ ఉంటే విడుదలకు ఆటంకాలు తొలగిపోయినట్లే. థియేటర్ల సమస్య ఉండదు. అందుకే దామోదర్ ఓకే చెప్పేశాడు. తేజ తనదైన స్టయిల్లో పాత రోజులకు వెళ్లిపోయి పక్కా లవ్ స్టోరీ తీసినట్లు చెబుతున్నాడు. తనలోని ఒకప్పటి అగ్రెసివ్ నెస్ ఈ సినిమాలో కనిపిస్తుందని.. కచ్చితంగా ఈసారి హిట్టు కొట్టి తీరుతానని బల్లగుద్ది మరీ చెప్పాడు తేజ. కొత్త హీరో హీరోయిన్లు దిలీప్ దక్ష.. ప్రోమోస్ లో బాగానే కనిపిస్తున్నారు. కాన్సెప్ట్ టేకింగ్ పరంగా కొత్తపుంతలు తొక్కినట్లు ?హోరాహోరీ? యూనిట్ చెబుతోంది. మరి వీరి ప్రయత్నం ఏమేరకు మెప్పిస్తుందో సెప్టెంబరు 11న తేలిపోనుంది.

,  ,  ,