Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-May-2016 15:32:56
facebook Twitter Googleplus
Photo

తమిళ హీరో సూర్యను తెలుగోళ్లు ఎప్పుడో ఓన్ చేసుకున్నారు. ప్రయోగాల బాటలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ.. తెలుగులో అతడి మార్కెట్ కు వచ్చిన ఢోకా ఏమీ లేదని ?24? సినిమాతో రుజువైంది. ఈ సినిమాకు తమిళంతో సమానంగా తెలుగులో ఓపెనింగ్స్ రావడం కోలీవుడ్ వర్గాలకు పెద్ద షాకే. విశేషం ఏంటంటే.. ?24? ఫుల్ రన్ కలెక్షన్లు తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ ఉండే అవకాశాలున్నాయట. తమిళంలో ఈ సినిమాకు రివ్యూయర్ల నుంచి అంత మంచి రెస్పాన్స్ రాలేదు. ప్రేక్షకులు కూడా అంతగా ఎగ్జైటవ్వలేదు. కానీ తెలుగు సమీక్షకులు.. ప్రేక్షకులు ఇద్దరూ కూడా ?24?కు నీరాజనాలు పలికారు. చాలా మంచి టాక్ తో.. మంచి ఓపెనింగ్స్ తో మొదలైందీ సినిమా.

ఇప్పటికే తెలుగులో రూ.15 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది ?24?. ఇక యుఎస్ లో ?24?కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగు-తమిళ భాషల్లో కలిపి ఈ సినిమా అక్కడ ఒకటిన్నర మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. ఇందులో మెజారిటీ వాటా తెలుగు వెర్షన్ దే కావడం విశేషం. తమిళ సినిమాలకు దేశీయంగా మన కంటే మంచి మార్కెట్ ఉన్నప్పటికీ.. యుఎస్ లో మాత్రం ఆ సినిమాలు వీకే. ఇప్పటిదాకా సూర్యకు అక్కడ మిలియన్ మార్కు సినిమానే లేదు. ఐతే ?24?కు తెలుగులో అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు అదిరిపోయాయి. సూర్యకు అక్కడ కొత్తగా మార్కెట్ విస్తరించింది. విక్రమ్ కుమార్ కు వరుసగా ఇది రెండో 1.5 మిలియన్ డాలర్ల సినిమా కావడం విశేషం. ఇంతకుముందు మనం కూడా ఈ క్లబ్బులో చేరింది.

,  ,  ,  ,  ,