Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2016 10:36:03
facebook Twitter Googleplus
Photo

కోలీవుడ్ హీరో సూర్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ 24తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మే 6న రిలీజ్ డేట్ ఇప్పటికే అనౌన్స్ చేసేయగా.. ప్రమోషన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ట్రైలర్ చూస్తుంటే సూర్య ఏదో మాయ చేయబోతున్నాడనే విషయం అర్ధమవుతోంది కానీ.. ఈ సినిమాపై టాలీవుడ్ ఆడియన్స్ లో చాలా కంగారు ఉంది. గతంలో సూర్య ఇలాంటి వింత వింత కేరక్టర్లతో వచ్చి చాలాసార్లే జనాలను భయపెట్టేశాడు. అయితే వీటిలో ఒక్కటంటే ఒక్కటి అయినా ఆడితే ఒట్టు.

రెండేళ్ల క్రితం రాక్షసుడు అనే సినిమా చేశాడు సూర్య. ఇందులో తండ్రీ కొడుకులుగా ఒకటి దెయ్యం పాత్రతో.. డ్యుయల్ రోల్స్ చేశాడు. ఇది మనోళ్లకు ఏ మాత్రం ఎక్కలేదు. అంతకు ముందు సూర్య సన్నాఫ్ క్రిష్ణన్ అంటూ ముసలోడి గెటప్ తో మాయ చేద్దామని ట్రై చేసిన ఆ ఎటెంప్ట్ కూడా ఫెయిలైంది. ఇక సెవెంత్ సెన్స్ లో అయితే.. లోక రక్షకుని రేంజ్ లో రెచ్చిపోయి చేసిన సినిమాని కూడా జనాలు అసలు పట్టించుకోలేదు.

బ్రదర్స్ అంటూ అతుక్కుని పుట్టిన అన్నాదమ్ముల పాత్రతో ఓ సినిమా చేశాడు. దీనికి అడ్రస్ కూడా దొరకలేదు. సుందరాంగుడు అంటూ వికృత రూపంతో సినిమా చేస్తే.. జనాలు భయపడిపోయారు. ఘటికుడు మూవీలో ఓ 13 ఏళ్ల పిల్లాడిగా వేసిన వింత వేషం కూడా జనాలకు నచ్చలేదు. ఓవరాల్ గా సూర్య చేసిన ప్రయోగాలు ఏవీ ఎవరినీ ఆకట్టుకోలేదు. ఇప్పుడు 24 మూవీలో 3 పాత్రలతో రకరకాల గెటప్పులతో దర్శనమిస్తుంటే.. ఆడియన్స్ కు ఓ రేంజ్ టెన్షన్ పట్టుకుంది. ట్రైలర్ బాగానే ఉన్నా.. సినిమాతో సూర్య భయపెట్టేస్తాడేమో అనుకుంటున్నారు.

,  ,  ,  ,  ,