Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Oct-2016 12:24:03
facebook Twitter Googleplus
Photo

శ్రుతి హాసన్ తో తొలిసారి పని చేసిన స్టార్ హీరో సూర్యనే. వీళ్లిద్దరూ కలిసి సెవన్త్ సెన్స్ సినిమాలో నటించారు. మొదట్లో శ్రుతికి ఐరెన్ లెగ్ అన్న ముద్ర పడ్డా అదేమీ పట్టించుకోకుండా తనతో జోడీ కట్టడానికి ఒప్పుకున్నాడు సూర్య. ఆ సినిమా ఆడకున్నా తర్వాత.. గబ్బర్ సింగ్ దగ్గర్నుంచి వరుస హిట్లతో దూసుకెళ్లింది శ్రుతి. ఇప్పుడామె సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరు. ఇప్పుడు మళ్లీ శ్రుతి.. సూర్య సరసన నటిస్తోంది. ఆ సినిమానే ?ఎస్-3?. సింగం సిరీస్ లో భాగంగా వస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమాలో సూర్య-శ్రుతి ఎలా ఉంటుందో శాంపిల్ గా ఒక ఫొటో వదిలింది ?ఎస్-3? టీమ్.

?సెవన్త్ సెన్స్? రోజులతో పోలిస్తే పూర్తి భిన్నంగా కనిపిస్తోంది సూర్య-శ్రుతి జంట. శ్రుతిలో ప్రస్తుతం ఎంతో మెచ్యూరిటీ కనిపిస్తోంది. ఇద్దరి జోడీ చూడముచ్చటగా ఉంది. సినిమాలో సూర్య-శ్రుతి కెమిస్ట్రీ భలేగా ఉంటుందని ఈ ఫొటో చూస్తే అర్థమవుతోంది. మూడో భాగంలోనూ అనుష్క ఉన్నప్పటికీ ఈ సినిమాకు శ్రుతినే ప్రధాన ఆకర్షణ అవుతుందనడంలో సందేహం లేదు. దీపావళి కానుకగా ?ఎస్-3? ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా డిసెంబరు 19న తమిళ-తెలుగు భాషల్లో విడుదల కానుంది. ?సింగం తొలి రెండు భాగాలు సూపర్ హిట్టయిన నేపథ్యంలో ?ఎస్-3?పై అంచనాలు భారీగా ఉన్నాయి.

,  ,  ,  ,  ,