Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-May-2015 11:13:55
facebook Twitter Googleplus
Photo

సూర్య కథానాయకుడిగా తమిళ్లో నిర్మించబడిన 'మాస్' చిత్రం, తెలుగు ప్రేక్షకుల ముందుకి 'రాక్షసుడు' పేరుతో రానుంది. తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కొంతభాగం హారర్ నేపథ్యంలో కొనసాగుతుందనే వార్త బయటికి వచ్చేసరికి, అసలు సూర్య పాత్ర ఎలా ఉండనుందోననే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేశాడని తెలుస్తోంది.

శక్తి అనే పాత్రలోనూ .. అనాథగా పెరిగి తెలివిగా దొంగతనాలుచేసే వాడిగాను రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని అంటున్నారు. అయితే ఏ పాత్ర ప్రేక్షకులను భయపెట్టనుందనేది మాత్రం వెండితెరపైనే తెలుసుకోవలసినదిగా కనిపిస్తోంది. ఇక నయనతార .. ప్రణీతల్లో ఏ పాత్రకి ఎవరు జోడీ అనేది కూడా అప్పుడే తేలనుంది. పోతే ఈ మధ్యకాలంలో ఒక వైపున హారర్ కథలు .. మరోవైపున దొంగల కథలకి గిరాకీ ఎక్కువైంది. దాంతో సూర్య తెలివిగా ఈ రెండింటినీ మిక్స్ చేసి ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

,  ,  ,  ,  ,  ,