Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Mar-2015 11:40:01
facebook Twitter Googleplus
Photo

తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తానంటూ ఎప్పటి నుంచో ఊరిస్తున్న తమిళ హీరో సూర్య ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. తెలుగులో తన డెబ్యూ ఫిలిం భారీగా, పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో ఇప్పటికే పూరీ జగన్నాథ్, వీవీ వినాయక్ వంటి హీరోలతో చర్చలు జరిపాడు. ఈ క్రమంలో తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా డిస్కషన్స్ జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే వీరిద్దరూ రెండు మూడు సార్లు కలుసుకున్నారట. త్రివిక్రమ్ ఓ సబ్జెక్టు కూడా వినిపించాడని అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

,  ,  ,  ,