Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2015 10:44:21
facebook Twitter Googleplus
Photo

తమిళ తెరపై కొత్తదనం కోసం ఆరాటపడే కథానాయికలలో కమల్ హాసన్ .. విక్రమ్ తరువాత 'సూర్య' పేరు వినిపిస్తుంది. తాను చేస్తోన్న ప్రతి పాత్ర కొత్తగా అనిపించడం కోసం ఆయన ఎంత కష్టమైనా పడుతుంటాడు. అలాంటి కొత్తదనంతో రూపుదిద్దుకున్న చిత్రంగా 'మాస్' చిత్రం కనిపిస్తోంది. ఇది తమిళ్ లో ఆయన నటించిన తాజా చిత్రం. ఒక విభిన్నమైన కథాశంతో ఈ సినిమాను వెంకట్ ప్రభు తెరకెక్కించాడు. సూర్య పాత్రను ... ఆ పాత్రకి తగినట్టుగా ఆయన గెటప్ ను తీర్చిదిద్దిన తీరుతో ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కీ .. టీజర్ కి అనూహ్యమైన స్పందన లభించింది.

దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది. నయనతార .. ప్రణీత కథానాయికలుగా అలరించనున్న ఈ సినిమా, షూటింగ్ పార్ట్ ని పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సూర్య మొదటి నుంచి తెలుగుకి కూడా ప్రాధాన్యతను ఇస్తూ వచ్చినందు వలన, ఇక్కడ కూడా ఆయనకి అభిమానులు ఎక్కువగానే వున్నారు. ఈ సినిమా కోసం అటు తమిళ అభిమానులతో పాటు, ఇటు తెలుగు ఫ్యాన్స్ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

,  ,  ,  ,  ,