Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Nov-2016 09:57:44
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ బొత్తిగా కనిపించరు. ఎప్పుడన్నా ఓ సారి ఎవరైనా అలా మెరిసినా ఆ మెరుపులు అక్కడితోనే ఆగిపోతాయ్. వాళ్లకి ఎంకరేజ్మెంట్ లేకపోవడం ఓ కారణమైతే.. నార్త్ భామల్లాగా మనోళ్లు బాడీ కొలతలు మెయింటైన్ చేయకపోవడం మరో రీజన్. ఫిజిక్ విషయంలో మధ్యలో అలాగే అదుపు తప్పింది తెలుగమ్మాయ్ స్వాతి. వెంటనే అలర్టైన స్వాతి ఇప్పుడు కొత్త లుక్ లో అదరగొట్టేస్తోంది.

యాక్టింగ్ లో స్వాతికి వంక పెట్టడానికి లేదు. అయితే తమిళ్.. మలయాళం మూవీస్ చేస్తూ బాడీ మీద ఫోకస్ పెట్టకపోయే సరికి మధ్యలో షేపవుటైపోయింది. కార్తీకేయ వరకు బానే అనిపించినా.. త్రిపుర మూవీలో మాత్రం స్వాతి లుక్స్ అండ్ పర్సనాల్టీ మీద దారుణమైన కామెంట్స్ పడ్డాయ్. ఇక స్వాతిని మర్చిపోవచ్చు అనుకున్నారంతా. కానీ కామెంట్స్ ని ఛాలెంజింగ్ తీసుకొన్న స్వాతి ఇప్పుడు స్లిమ్ అయి తనని కామెంట్ చేసిన వాళ్లు నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

మళ్లీ తగ్గేదాకా ఎవరికి కనిపించను.. త్వరలో పాత స్వాతిని చూస్తారన్న స్వాతి అనడమే కాదు యోగాసనాలు వేస్తూ ఒళ్లు వంచింది. రిజల్ట్ స్వాతి ఫేస్ లో చాలా ఫ్రెష్ గా కనిపిస్తోంది. న్యూ లుక్ లో అందర్ని మెస్మరైజ్ చేసేస్తోంది. లాంగ్ ఎల్లో టాప్.. వైట్ షూ వేసుకోని బెంగళూర్ లోని బ్లోసమ్స్ బుక్ హౌస్ లో పుస్తకాలు చదువుతూ హాట్ హాట్ గా కనిపించిన స్వాతిని చూసి ఇప్పుడందరూ తూ ఛీజ్ బడీ హే మస్త్ మస్త్ అంటున్నారు. మరి ఇదే ఊపులో కూడా ఆఫర్స్ వస్తే స్క్రీన్ మీద మళ్లీ స్వాతి కలర్స్ చూడటం గ్యారంటీ.

,  ,  ,  ,  ,