Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jun-2017 11:37:15
facebook Twitter Googleplus
Photo

కలర్స్ స్వాతిగా తెలుగు ప్రజలకు సుపరిచితమైన స్వాతి రెడ్డి.. అష్ట చమ్మ తో హీరోయిన్ గా కెరియర్ ను మొదలి పెట్టి మన తెలుగు నంది అవార్డ్ పట్టి తమిళ్ సినిమా సుబ్రమణ్యపురం తో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ను కూడా తీసుకుంది. తమిళ్ - తెలుగు - మలయాళం అన్నింటి లోనూ సినిమాలు చేస్తూ ఇప్పుడు కాస్త గ్యాప్ తరువాత మనముందుకు వస్తోంది.

లండన్ బాబులు సినిమాతో స్వాతి హీరోయిన్ గా నూతన నతడు రక్షిత్ ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు మారుతి ఒక సినిమా తీస్తున్నాడు. ఈ టీజర్ ను చూస్తే.. ఒక మధ్యతరగతి యువతి యువకుడు ప్రేమ కథ అని చెప్పవచ్చు. ఒక కామన్ మాన్ స్టైల్ లవ్ స్టోరీ లో ఉండే ఫన్ - ఫ్యామిలి - డ్రామా అన్నీ కలిపి కొంత థ్రిల్లర్ ను కథలో పెట్టి ఫీల్ గుడ్ మూవీగా తెరక్కెక్కిస్తున్నారు. హీరో ఫ్రెండ్ గా హాస్య నటుడు ధనరాజ్ నటించడంతో కామిడీ తప్పకుండా ఉంటుంది అని అర్ధం అవుతుంది. వీళ్ళు ఎలా ప్రేమించుకొంటారు ఎందుకు బాబు లండన్ వెళ్తాడు వెళ్ళిన తరువాత పరిణామాలు ఏంటి అనేవి తెలుసుకోవాలి అనిపిస్తే తుపాకిని చదువుతూ ఉండండి.

విషయం ఏంటంటే.. ఈ సినిమా ఇప్పటికే తమిళ్ లో హిటైన ఆదవన్ కట్టలై అనే సినిమా రీమేక్ అని చెబుతున్నారు. హీరోయిన్ గా తెలుగులో స్వామి రా రా తో మళ్ళీ ట్రాక్ లో పడిన స్వాతి చాల గ్యాప్ తరవాత ఈ సినిమాతో లీడ్ రోల్ లో కనిపిస్తుంది.

,  ,  ,  ,  ,  ,