Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Nov-2016 10:23:06
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగార్జున.. టబుల బంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక టైంలో నాగార్జునకు అంత్యంత ఇష్టమైన హీరోయిన్ టబునే. ఆమెతో కలిసి నిన్నే పెళ్లాడతా ఆవిడా మా ఆవిడే? లాంటి సినిమాలు చేశాడు నాగ్. వాళ్లిద్దరికీ వ్యక్తిగతంగా కూడా మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధం వల్లే చాన్నాళ్ల తర్వాత నాగ్ అడిగాడని తెలుగులో నటించడానికి ఒప్పుకుందట టబు. నాగ్ చిన్న కొడుకు అఖిల్ హీరోగా నటించబోయే రెండో సినిమాలో టబు ఓ కీలక పాత్రలో నటించబోతోందని సమాచారం. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో టబు నటించడం ఖాయమని తెలుస్తోంది.

తెలుగులో టబు చివరగా 2008లో ఇదీ సంగతి సినిమా చేసింది. అదే ఏడాది పాండురంగడు లో ఓ ముఖ్య పాత్ర పోషించింది. ఆ తర్వాత ఆమె తెలుగు వైపు కన్నెత్తి చూడలేదు. హిందీలో మాత్రం హైదర్.. దృశ్యం లాంటి సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. తెలుగులో సరైన పాత్రలు రాకపోవడం కూడా ఆమె ఇక్కడ నటించకపోవడానికి ఒక కారణం. ఐతే అఖిల్-విక్రమ్ సినిమాలో మాత్రం ఆమె పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందట. పైగా నాగ్ అడిగేసరికి టబు కాదనలేకపోయింది. నాగార్జున-టబుల కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అఖిల్.. టబుల పాత్రలు.. వాళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటాయి అన్న ఆసక్తి జనాల్లో కలగడం సహజం. మేఘా ఆకాశ్ కథానాయికగా నటించే ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది. ప్రస్తుతం తన రచయితల బృందంతో కలిసి స్క్రిప్టును పూర్తి స్థాయిలో తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు విక్రమ్ కుమార్.

,  ,  ,  ,  ,  ,