Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Aug-2016 13:09:43
facebook Twitter Googleplus
Photo

నాగార్జున -టబులది సూపర్ జోడి. నిన్నే పెళ్ళాడతా ? లో ఈ జోడి పడించిన రోమాన్స్ అంత తేలిగ్గా మర్చిపోలేం. ఆ తర్వాత ?ఆవిడే మా ఆవిడా?లో కూడా జతకట్టిందీ జోడి. సిసింద్రీ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా వుంది. అయితే చేసింది రెండు సినిమాలే అయినా టాలీవుడ్ లో ఈ జోడి హాట్ టాపిక్. వీరిపై కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. అయితే వీటిని కొట్టిపారేశాడు నాగ్. ?టబు మా ఫ్యామిలీ ఫ్రెండ్ . ఇంకా చెప్పాలంటే మా ఫ్యామిలీ మెంబర్? అని చెప్పుకొచ్చారు నాగ్ ఓ సందర్భంలో.

ఇప్పటికీ అక్కినేని ఇంట్లో ఏదైనా శుభకార్యం వుంటే కనిపిస్తుంటుంది టబు. ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. చానాళ్లుగా మీడియాకు దూరంగా వున్న టబు అక్కినేని ఫ్యామిలీ హీరోకు విశేష్ చెప్పింది. సుశాంత్ తాజా చిత్రం ఆటాడుకుందాం రా. మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చినీ సినిమాకి విషెస్ చెబుతూ.. పేస్ బుక్ లో ఓ వీడియో పెట్టింది టబు. సినిమా బావుందని, తప్పకుండా చూడాలని కోరింది. సాదారణంగా ఇలాంటి బైట్ లకు దూరంగా ఉటుందామె. అయితే ఇక్కడ అక్కినేని ఫ్యామిలీ హీరో. సో.. ఈ అనుభందంతో తన మాట సాయం అందించిందీ సీనియర్ తార.

,  ,  ,  ,  ,  ,