Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Nov-2016 10:15:11
facebook Twitter Googleplus
Photo

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ స్లో అయిపోయిందేమో అనిపించడం సహజం. కానీ వరుస హిట్స్ తో తమ్మూ దూసుకుపోతున్న స్పీడ్ ఎవరికీ సాధ్యం కావడం లేదనే చెప్పాలి. బాహుబలి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే.. బెంగాల్ టైగర్.. ఊపిరి.. ధర్మదురై.. అభినేత్రి.. అంటూ వరుసగా హిట్స్ కొట్టేస్తోంది మిల్కీ. ఇది ఓకే కానీ.. బాహుబలి2 కాకుండా మరి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తోంది అంటే మాత్రం చెప్పడం కష్టం.

ఇదే డౌట్ తమ్మూని అడిగితే.. అమ్మడు ఇచ్చిన ఆన్సర్ కి మైండ్ బ్లాంక్ అయిపోవడం ఖాయం. 'ఈ ప్రాజెక్టుల గురించి ఇప్పుడే నేనేమీ చెప్పలేదు. నా రాబోయే ప్రాజెక్టులు అనౌన్స్ చేసినప్పుడు అందరూ షాకింగ్ అయిపోతారు. నా ఫ్యాన్స్ తో సహా చాలామంది ఇవి అనౌన్స్ అయ్యాక బోలెడంత సంతోషించేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో భాగం అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా' అని చెబుతోంది తమన్నా.

ఇప్పటికిప్పుడు అంత షాకింగ్ ఇచ్చే మూవీస్ ఏమున్నాయా అని ఆరా తీస్తే.. తమన్నాతో సినిమా చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆసక్తిగా ఉన్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తమన్నా మరో సినిమా చేసేందుకు కూడా అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఆగడు ఫ్లాప్ తో లైమ్ లైట్ లోకి రాలేకపోయిన తర్వాత మహేష్-తమన్నాల జంటను మరోసారి చూపించేందుకు ఓ స్టార్ డైరెక్టర్ రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమన్నా ఇచ్చే షాకులు ఇవే కావచ్చని టాక్. ఇక బాలీవుడ్ మూవీ క్వీన్ తమిళ్ రీమేక్ లో తమన్నానే ఖాయం చేశారు. ఇది కూడా అమ్మడి కెరీర్ కి బూస్ట్ ఇచ్చే ప్రాజెక్టే.

,  ,  ,  ,  ,  ,