Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jul-2016 12:29:46
facebook Twitter Googleplus
Photo

సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ. దానికి తోడు సక్సెస్ లేనప్పుడు మరీ భయాలు ఎక్కవ అవుతూంటాయి. ప్రతీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలనిపిస్తుంది. అంతకు ముందు తమ సినిమాల్లో హిట్టైన ఎలిమెంట్స్ ని తీసుకు వచ్చి కలపాలి అనిపిస్తూంటుంది. ఇవి బయిటనుంచి చూసి వారికి అతి క్రింద కనిపించినా, కోట్లతో ముడిపడ్డ వ్యాపారంలో ఇవి కామన్. అలాగే ఇప్పుడు దర్శకుడు సంపత్ నందికి తమన్నా అంటే సెంటిమెంట్ అని మీడియాలో వినిపిస్తోంది. దానికి కారణం.. గతంలో సంపత్‌ నంది దర్శకత్వం వహించిన రచ్చ.. బెంగాల్‌ టైగర్‌ సినిమాల్లో తమన్నా నటించింది. ఈ సినిమాలు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో తన సినిమాలో తమన్నా చేస్తే హిట్‌ ఖాయమనే ఒక సెంటిమెంట్‌ ను సంపత్‌ నంది నమ్ముతున్నాడు. స్పెషల్‌ సాంగ్‌ లో మెరవడానికి ఆయన తమన్నాను ఒప్పించాడని అంటున్నారు. అయితే అంత పెద్ద మొత్తం పెట్టి తమన్నాను తమ సినిమాలో తీసుకోవటానికి నిర్మాత ఆసక్తి చూపకపోయినా..అవసరమైతే తన రెమ్యునేషన్ అయినా తగ్గించుకుని ఆమెను సీన్ లోకి తెమ్మని కోరాడంటున్నారు సినీ వర్గాలు. అదే నిజమైతే తన సెంటిమెంట్ తమన్నా కోసం తన రెమ్యునేషన్ ఎమౌంట్ ని త్యాగం చేసినట్లే. అయితే ఈ విషయం విన్న తమన్నా కూడా తనకు సంపత్ నంది అంటే అభిమానం ఉందని, తను స్పెషల్ సాంగ్స్ కు తీసుకునే రెమ్యునేషన్ తగ్గించి తీసుకుంటానని ప్రామిస్ చేసిందని చెప్పుకుంటున్నారు. ఇందులో నిజమెంత ఉందో కానీ చెప్పుకోవటానికి మాత్రం చాలా బాగుంది కదా.

,  ,  ,  ,  ,  ,