Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Feb-2017 16:24:25
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలకృష్ణ 101వ సినిమా.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందనుందనే విషయం ఇప్పటికైతే ఇక లాంఛనమే. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకపోయినా.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయని ముందే చెప్పేసుకున్నాం. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీని ఖాయం చేశారనే న్యూస్ సెన్సేషన్ అవుతోంది.

బాలకృష్ణతో తమన్నా కాంబినేషన్.. నిజంగా ఎవరూ ఊహించని విషయమే. సినిమాల ఎంపికలోనే వైవిధ్యం చూపించే బాలకృష్ణ.. హీరోయిన్స్ ఎంపికలోనూ పాటించేస్తూ ఉంటారు. ఇప్పుడు మిల్కీ బ్యూటీతో ఆయన రొమాన్స్ చేయనున్నారనే విషయాన్ని తమిళ మీడియా లీక్ చేసింది. మరోవైపు తన వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న తర్వాత.. సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణతో కలిసి నటించేందుకు యంగ్ బ్యూటీస్ కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేఎస్ రవికుమార్ ఇప్పటివరకూ తెలుగు మీడియాతో ఏమీ మాట్లాడకపోయినా.. తమిళ మీడియాకు మాత్రం కొన్ని లీకులు ఇస్తున్నారు. అలా బయటపడ్డదే ఈ బాలయ్య-మిల్కీ కాంబినేషన్ కూడా. తన 101వ సినిమాలో బాలకృష్ణ మరోసారి ఫ్యాక్షన్ ఉగ్రరూపాన్ని చూపించనున్నారని టాక్

,  ,  ,  ,  ,  ,