Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2016 10:34:28
facebook Twitter Googleplus
Photo

మిల్కీ బ్యూటి తమన్నా అసలు ''బాహుబలి'' సినిమాలో ఆ రేంజులో మెరుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఏదో రెండో హీరోయిన్ గా ఉత్తినే సైడ్ క్యారెక్టర్ లా తమన్నాను తీసుకున్నారని ముందులో అందరూ అనుకున్నా కూడా.. బాహుబలిః ది బిగినింగ్ సినిమాలో ఏకంగా ఫస్టాఫ్ అంతా అమెకే ఇచ్చేసి.. పైగా గ్లామరసాన్నిఫుల్లుగా దట్టించడానికి అవకాశం ఇచ్చేసి.. అప్పటికి ఆవిరైపోతున్న ఆమె కెరియర్ కు కొత్త ఊపునిచ్చాడు రాజమౌళి.

కాని మొన్నామధ్యన మాట్లాడుతూ.. జక్కన్న ఏమన్నాడంటే.. అసలు బాహుబలిః ది కంక్లూజన్ లో మాత్రం కేవలం అనుష్కతోనే ప్రభాస్ రొమాన్స్ చేస్తాడని.. అంతేకాని తమన్నాతో ఒక్క సాంగ్ కూడా లేదని సెలవిచ్చాడు. ఆ దెబ్బతో తమన్నా ఫ్యాన్స్ అందరూ షాక్ తినేశారు అంతే. ఇదే విషయాన్ని తమన్నా దగ్గర ప్రస్తావిస్తే.. ''కేవలం చిన్న పాత్ర ఆఫర్ చేసి.. దానిని మొదటి భాగంలో అంత పెద్దగా తీర్చిదిద్దారు రాజమౌళి. అసలు రెండో భాగంలో కూడా నన్ను తీసుకోవడమే పెద్ద విషయం. ఇప్పుడు మళ్ళీ పాటలు లేవు.. డైలాగులు లేవు అంటే బాగోదు'' అంటూ సెలవిచ్చింది అమ్మడు.

ఆ మాత్రం గ్రౌండెడ్ గా ఉంటుంది కాబట్టి అసలు తమన్నాకు మనోళ్ళు అలా రెడ్ కార్పెట్ వేసి మరీ అవకాశాలు ఇస్తున్నారని అంటున్నారు సినిమా నిపుణులు. అది సంగతి.

,  ,  ,  ,  ,