Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jul-2016 11:00:35
facebook Twitter Googleplus
Photo

ఇన్నాళ్లు గ్లామర్ పాత్రల్లో అలరించిన తమన్నా, తొలిసారిగా నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా అభినేత్రి. నటుడిగా, కొరియోగ్రాఫర్గా, దర్శకుడిగా మంచి విజయాలు సాధించిన ప్రభుదేవా.. ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాను 70 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.

తెలుగు వర్షన్కు కోన వెంకట్, ఎంవివి సత్యనారాయణ, బ్లూ సర్కిల్ కార్పొరేషన్లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న అభినేత్రి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా ఆడియో వేడుకను భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

ఆగస్టు 15న విజయవాడ వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అతిలోక సుందరి శ్రీదేవి హాజరవుతారన్న టాక్ వినిపిస్తోంది. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్, మురళీ శర్మలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,