Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Nov-2017 12:17:16
facebook Twitter Googleplus
Photo

ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను. హిట్స్ వచ్చినా.. మంచి యాక్ట్రెస్ అని ప్రూవ్ చేసుకున్నా.. ఎవరూ తనను స్టార్ గా చూడడం లేదని గట్టిగానే వాపోయింది. అయితే.. అమ్మడికి మెల్లగా అదేంటో తెలిసివస్తోంది.

ప్రస్తుతం తాప్సీతో యాడ్ అండార్స్ మెంట్స్ కుదుర్చుకునేందుకు చాలామందే ఉత్సాహం చూపుతున్నారు. జుడ్వా2తో కమర్షియల్ గా కూడా సక్సెస్ కావడం ఇందుకు సపోర్ట్ చేసిందని చెప్పచ్చు. అయితే.. ఈమె దగ్గరకు వచ్చే ఆఫర్లలో.. కొన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ.. మరికొన్నిటికి అయితే అసలు ఆఫర్ మాట కూడా వినకుండా తిరక్కొట్టేస్తోందట. ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్స్ కు.. ఆల్కహాల్ సంబంధిత ప్రకటనలకు దూరంగా ఉండాలని ముందు నుంచే ఫిక్స్ అయిపోవడంతో.. ఇప్పుడు ఎలాంటి క్రేజీ ఆఫర్ వచ్చినా.. వాటిలో మాత్రం నటించేది లేదని తెగేసి చెబుతోందట తాప్సీ.

ఓ హీరోయిన్ డబ్బులను వద్దని.. నీతి అంటూ మాటలు చెప్పడం నిజంగా హర్షణీయమే. అయితే.. ఈమెకు ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా అవకాశాలు ఇచ్చి బేస్ వేసిన దక్షిణాది సినిమాలను వీలు చిక్కినప్పుడల్లా విమర్శిస్తూ.. ఇవాళ రెండు హిట్స్ అందగానే వెంటబడుతున్న బాలీవుడ్ ను పొగడ్డం కూడా.. తాప్సీ పన్ను స్టైల్ నీతి నియమాల్లో భాగమేమో అనుకుంటున్నారు చాలామంది.

,  ,  ,  ,