Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-May-2016 11:09:55
facebook Twitter Googleplus
Photo

రాము స్కూల్ నుంచి వచ్చిన వారిలో వివాదస్పద దర్శకుల్లో మరో ముఖ్యుడు తేజ.ఈయనగారు ప్రజెంట్ ఫామ్ లో లేక సరిగా హైలెట్ కావడం లేదు గాని.... అయ్యగారు కాంట్రవర్సీల్లో చాలా ఘనులని చెప్పక తప్పదు.తనకు నచ్చిన వారితోనే సినిమాలు చేసి నచ్చనివారితో సినిమాలే చేయరు. నటీనటులతో యాక్టింగ్ రాబట్టుకోవడంలోను ఈయనగారి కంటూ ఓ ట్రీట్ మెంట్ ఉంది.అలాంటి తేజ తాజాగా చేస్తోన్న చిత్రం అహం.ఈసినిమాలో యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ విలన్ గా చేస్తోన్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈసినిమా కొన్ని అనుకోని కారణాలతో సెట్స్ మీదకు వెల్లకుండా పోయింది.

త్వరలో సెట్స్ మీదకు కూడా వెల్లే ఈ చిత్రం ఇంకా మొదలు కాక పోవడానికి ప్రధాన కారణం.. హీరోతో పాటు చాలామంది కొత్త ఆర్టిస్ట్ లు ఇంకా ఫైనలైజ్ కాకపోవడమే. అహం చిత్రానికి నటుడు బాలాదిత్య సాహిత్యం అందిస్తూ సింగిల్ కార్డ్ ను కూడా కొట్టేశాడు. గతంలో తేజ చిత్రాల్లో కులశేఖర్ కు మాత్రమే ఇలా సింగిల్ కార్డ్ పడేది. ఇప్పుడది బాలాదిత్యకు వచ్చింది. అక్కడితో ఆగకుండా అహంలో బాలాదిత్య కీ రోల్ కూడా దక్కింది. అయితే సినిమా స్టార్ట్ కాకముందే బాలాదిత్య అత్యుత్సాహానికి పోయి అహంలో నేనే హీరో అంటూ ఓ లీడింగ్ వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది తేజకు ఎక్కడిలేని కోపం వచ్చేలా చేసి అహం ప్రాజెక్ట్ నుంచి బాలాదిత్యను తప్పించేలా చేసిందట.

తేజ చిత్రాల విషయంలో రూల్ ఈజ్ రూల్ అనే మాటను అంతగా పట్టించుకోకపోవడం వలనే... డైరెక్టర్ తేజ ఆగ్రహానికి బాలాదిత్య గురయ్యాడని బుల్లితెరపై నటించే అతని మిత్రులు బావిస్తున్నారు.

తేజ తీసుకున్న ఈ డెసిషన్ ద్వారా మనలో అహం తగ్గించుకుంటేనే తేజ అహంలో అవకాశం అందిపుచ్చుకోవచ్చని అటు ఆడిషన్ టెస్ట్ లకు వస్తోన్న వారికి కూడా భాగా అర్ధమైందంటూ ఫిల్మ్ నగర్లో రూమర్లు రౌండ్లు కొడుతున్నాయి.

,  ,  ,  ,  ,  ,