Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jun-2017 10:14:13
facebook Twitter Googleplus
Photo

కొందరు దర్శకులు వేసే ముద్ర అలా ఇలా ఉండదు. ఆ ముద్ర నుంచి బయటికి రావడం.. ఆ దర్శకుల మీద అభిమానం చంపుకోవడం సులువు కాదు. చిత్రం.. నువ్వు నేను.. జయం లాంటి సినిమాలతో తేజ అలాంటి ముద్రే వేశాడు. భారీగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అప్పట్లో అతను యూత్ కు ఫేవరెట్ డైరెక్టర్. కానీ జయం తర్వాత తేజ అంచనాల్ని అందుకోలేకపోయాడు. ఒకటి రెండు కాదు.. పుష్కర కాలంలో రెండంకెల సంఖ్యలో ఫ్లాపులిచ్చాడు తేజ. ప్రతిసారీ తేజ ఏదో చేస్తాడని ఆశించి థియేటర్లకు వెళ్లడం.. నిరాశగా బయటికి రావడం.. ఆయన అభిమానులకు అలవాటైపోయింది. తేజ ఫ్లాప్ సినిమాలు తీయడం కంటే కూడా.. తన బ్లాక్ బస్టర్ మూవీ జయంను కాపీ కొడుతూ అదే తరహా సినిమాలు తీయడమే ఆయన ఫ్యాన్స్ ను ఎక్కువ నిరాశ పరిచింది.

తేజ చివరగా తీసిన హోరాహోరీ సైతం అచ్చం జయం ఫార్మాట్లో తెరకెక్కిన సినిమా. ప్రేక్షకులకు విసుగొచ్చి ఆ సినిమాను తిప్పికొట్టారు. ఐతే ఎట్టకేలకు తేజ జయం హ్యాంగోవర్ నుంచి బయటికి వచ్చినట్లే కనిపిస్తోంది నేనే రాజు నేనే మంత్రి టీజర్ చూస్తుంటే. ఈ టీజర్ చూస్తే అసలు తేజ పాత సినిమాల ఛాయలేవీ కనిపించలేదు. ఇది ఆ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండేలాగే కనిపిస్తోంది. టీజర్ కాన్సెప్ట్.. అందులో వినిపించిన డైలాగులు.. విజువల్స్.. అన్నీ కూడా రిఫ్రెషింగ్ గా అనిపించాయి. ఈసారి తేజ నుంచి భిన్నమైన సినిమా ఆశించొచ్చన్న భరోసా కలిగించాయి. ఇంతకుముందు నిజంలో కొంతమేర రాజకీయాల్ని టచ్ చేసిన తేజ.. ఈసారి పూర్తి స్థాయి పొలిటికల్ మూవీ తీస్తున్నాడు.

,  ,  ,  ,  ,