Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Sep-2016 11:11:52
facebook Twitter Googleplus
Photo

అయితే దేవిశ్రీ ప్రసాద్.. కాదంటే తమన్. వీళ్లిద్దరిదే ఐదారేళ్లుగా టాలీవుడ్లో ఆధిపత్యం. ఐతే ఇద్దరి మీదా ఓ కంప్లైంట్ ఉంది. రొటీన్ మ్యూజిక్ ఇస్తుంటారు. ట్యూన్లు రిపీట్ చేస్తుంటారని. ఈ విషయంలో దేవిశ్రీ కొంచెం బెటర్. తమన్ విషయంలో మాత్రం చాలా విమర్శలున్నాయి. ఐతే ఇప్పుడు ఈ ఇద్దరూ తమ కొత్త సినిమాలకు రూటు మారుస్తున్నారట. గత సినిమాలతో అస్సలు సంబంధం లేకుండా కొత్త ఔట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారట. ఇందుకోసం స్పెషల్ ఫోకస్ పెట్టి పని చేస్తున్నారట.

ముందుగా తమన్ కొత్తదనం గురించి మాట్లాడుకుందాం. సౌత్ ఇండియాలో అత్యంత స్పీడ్ గా మ్యూజిక్ చేసే సంగీత దర్శకుల్లో తమన్ ఒకడు. ఈ హడావుడిలోనే కొత్త ట్యూన్లు చేయలేకపోతుంటానని అంటుంటాడు తమన్. ఐతే సంపత్ నంది-గోపీచంద్ కాంబినేషన్లో రాబోయే సినిమాకు మాత్రం తమన్ మ్యూజిక్ వెరైటీగా ఉంటుందట. ఇందుకోసం దర్శకుడు సంపత్ నందితో కలిసి ఇంటెన్సివ్ మ్యూజిక్ సిట్టింగ్స్ వేస్తున్నాడట తమన్. ప్రత్యేకంగా ముంబయికి వెళ్లి మరీ బాణీలు సిద్ధంచేసే పనిలో పడ్డారట. ఇదివరకటితో పోలిస్తే పూర్తి భిన్నమైన బాణీలు.. నేపథ్య సంగీతం అడిగాడట సంపత్. తమన్ కూడా ఈ ప్రాజెక్టును ప్రెస్టీజియస్ గా తీసుకుని పని చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు అల్లు అర్జున్-హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోయే సినిమాకు దేవిశ్రీ కూడా ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడట. ఇది అల్ట్రా మోడర్న్ మూవీ కావడంతో కొత్త పరికరాలు వాడి.. సరికొత్త ట్యూన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడట దేవి. ఇంతకుముందు బన్నీకి చేసిన దేవి ఆల్బమ్స్ అన్నీ సూపర్ హిట్లే. బన్నీ అంటేనే స్పెషల్ ఫోకస్ పెట్టి పని చేస్తాడు దేవి. అలాగే హరీష్ శంకర్ కు చేసిన ?గబ్బర్ సింగ్? గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన టేస్టుకు.. ఎనర్జీకి మ్యాచ్ అయ్యే హీరో.. దర్శకుడు కావడంతో అందుకు తగ్గట్లే స్పెషల్ మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడట దేవి.

,  ,  ,  ,  ,  ,  ,