Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Feb-2017 11:32:52
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. కిక్ సినిమాతో ఒకేసారి ఎంతో పేరు సంపాదించి.. చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఆ తర్వాత అతడి జోరు ఎలా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశలో దేవిశ్రీ ప్రసాద్ సైతం అతడి ముందు నిలవలేకపోయాడు. వరుసగా సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తూ మిగతా మ్యూజిక్ డైరెక్టర్లందరూ అతడిని చూసి అసూయ చెందేలా దూసుకెళ్లాడు తమన్. ఐతే గత రెండేళ్లుగా అతడి జోరు తగ్గింది. ఒకప్పట్లా వరుసగా భారీ ప్రాజెక్టులు చేయట్లేదు. దేవిశ్రీ ప్రసాద్ మళ్లీ పుంజుకుని బడా ప్రాజెక్టులన్నీ తనే పట్టేస్తున్నాడు. గత ఏడాది తమన్ చేసిన ఏకైక పెద్ద సినిమా సరైనోడు మాత్రమే. మిగతావన్నీ చిన్న.. మీడియం రేంజి సినిమాలే.

ఇలాంటి టైంలో తనేంటో తమన్ రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు విన్నర్ సినిమానే అవకాశంగా మలుచుకున్నాడు తమన్. ఈ సినిమా పాటల్ని కొన్ని రోజులుగా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ముందు సితార.. అనే పాటను మహేష్ బాబు రిలీజ్ చేశాడు. అది ఇన్ స్టంట్ హిట్టయిపోయింది. తర్వాత పిచ్చోడినైపోయా అంటూ ఇంకో పాటను సమంత లాంచ్ చేసింది. దానికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక లేటెస్టుగా సూయ సూయ అనసూయ.. అంటూ ఒక పాట రిలీజ్ చేశారు. సుమ ఈ పాటతోనే సింగర్ అవతారం ఎత్తింది. ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తంగా తమన్.. ప్రతి పాటతోనూ తన ప్రత్యేకత చాటుకుంటున్నాడు. ?విన్నర్? ఆడియోకు ఆల్రెడీ సూపర్ టాక్ వచ్చేసింది. ఏదో మొక్కుబడిగా లాగించేయకుండా తమన్ ఈ ఆడియో మీద బాగానే శ్రద్ధ పెట్టినట్లున్నాడు. అందుకే సోషల్ మీడియాలో అందరూ ?తమన్ ఈజ్ బ్యాక్? అని అతడికి కితాబిస్తున్నారు.

,  ,  ,  ,  ,