Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jul-2016 11:11:23
facebook Twitter Googleplus
Photo

వరుస విజయాలతో జోరు మీద ఉన్న మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్, తన కొత్త సినిమా ?తిక్క?ను విడుదలకు సిద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. ఫస్ట్‌లుక్‌తో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ ప్రస్తుతం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. అదే ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాలో ఓ చిన్న రోల్‌లో కనిపించనుండడం. గతంలో ?బాయ్స్? అనే సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించిన థమన్, మళ్ళీ ఇప్పటికి ఓ చిన్న పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు.
సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తిక్క సినిమా ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుంది. ఈ వారమే థమన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ జరపనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో థమన్ చేయబోయే రోల్ ఏంటన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. రోహిణ్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో లారిస్సా బొనెస్సి, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,