Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Dec-2017 13:10:48
facebook Twitter Googleplus
Photo

నారా రోహిత్ హీరోగా అసుర అనే సినిమా తీసిన కృష్ణ విజయ్ గుర్తున్నాడుగా. అతనే ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. కృష్ణవిజయ్.. నారా రోహిత్ తో పాటు శ్రీవిష్ణుకు కూడా మంచి మిత్రుడు.

విష్ణు హీరోగా తెరకెక్కిన అప్పట్లో ఒకడుండేవాడు సినిమాకు రోహిత్ తో పాటు కృష్ణవిజయ్ కూడా ఒక నిర్మాత కావడం విశేషం. అసుర తర్వాత దర్శకుడిగా చాలా గ్యాప్ తీసుకున్న కృష్ణవిజయ్.. ఇప్పుడు శ్రీవిష్ణును హీరోగా పెట్టి సినిమా తీయబోతున్నాడు. దీనికి తిప్పరా మీసం అనె మంచి టైటిలే పెట్టుకున్నారు. ఈ టైటిల్ చూస్తే ఇదేదో మాస్ సినిమాలా ఉంది. మరి ఈ టైటిల్ శ్రీవిష్ణుకు ఎంతమాత్రం సూటవుతుందో చూడాలి.

ఇక తన మిగతా సినిమాల గురించి శ్రీవిష్ణు చెబుతూ.. నీది నాది ఒకే కథ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపాడు. త్వరలోనే టీజర్ రిలీజవుతుందని చెప్పాడు. దీంతో పాటుగా నారా రోహిత్.. సుధీర్ బాబు.. శ్రియ కాంబినేషన్లో ఇంద్రసేన అనే కొత్త దర్శకుడితో వీర భోగ వసంత రాయలు అనే ఓ కొత్త తరహా సినిమా చేస్తున్నానని చెప్పాడు.

,  ,  ,  ,  ,