Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jun-2016 12:42:59
facebook Twitter Googleplus
Photo

స్టార్ హీరోల పేర్లు చెబితే ప్రమోషన్స్ లేకపోయినా థియేటర్లకు జనాలు వచ్చేస్తారు. ఆ స్థాయికి చేరుకునే సూపర్ స్టార్లు కొద్ది మందే ఉంటారు. సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు ఈలిస్ట్ లో టాప్ లోనే ఉంటుంది.

చిన్నా చితకా సినిమాలకు కర్చీఫ్ లు - లక్కీ డ్రాలు - గోల్డ్ కాయిన్లు లాంటి ఆఫర్స్ ఇవ్వడం ఇన్నాళ్లు చూశాం. ఇప్పుడు రజినీకాంత్ మూవీ కబాలికి కూడా ఓ ఆఫర్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే.. ఇది అందరికీ కాదులెండి. బెంగళూరు వాసుల కోసం ట్రావెల్ మోర్ అనే కంపెనీ.. ఎయిరేషియా భాగస్వామ్యంతో ఓ ఆఫర్ ఇచ్చింది. అఫ్ కోర్స్ అలాగని ఇదేం ఫ్రీ ఆఫర్ కాదు లెండి. బెంగళూరు నుంచి బయల్దేరదీసి.. సినిమా చూపించి లంచ్-స్నాక్స్ ఇప్పించి.. ఓ ఆడియో సీడీ చేతిలో పెట్టి మళ్లీ బెంగళూరులో డ్రాప్ చేస్తారు. ఈ మొత్తానికి కలిపి ప్యాకేజ్ గా టికెట్లు అమ్మేస్తున్నారు.

ఓ సూపర్ స్టార్ సినిమా కోసం ఇలా ఆఫర్ ప్రకటించడం ఆశ్చర్యకరమే. కాకపోతే ఆనందించాల్సిన విషయం ఏంటంటే.. ఇది కేవలం ప్యాకేజ్ మాత్రమే. ఫ్రీ ఆఫర్లు కాదు. ఇలాంటి ప్రమోషన్స్ రజినీ రేంజ్ ని దెబ్బ కొట్టకపోయినా.. చెడ్డ పేరు తెస్తాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

,  ,  ,  ,  ,  ,