Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2016 19:14:12
facebook Twitter Googleplus
Photo

కెరీర్ స్టార్ట్ చేసిన దశాబ్ద కాలం పూర్తయిన తర్వాత.. చెన్నై బ్యూటీ త్రిష తొలిసారిగా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న 'నాయకి'.. తెలుగు - తమిళ భాషల్లో రూపొందుతోంది. హారర్ కామెడీ చిత్రంలో త్రిష నటిస్తోందని అనగానే చాలామందికి ఆశ్చర్యం వేసింది. అయితే.. దీనికంటే ముందే అరణ్మణై2 రిలీజ్ కావడంతో.. త్రిష దెయ్యం సినిమానా అనే కామెంట్స్ బాగానే తగ్గాయి.

ఎంతైనా అరణ్మణై 2.. అప్పటికే హిట్ అయిన మూవీకి సీక్వెల్. కానీ నాయకి సంగతి అలా కాదు. మూవీకి సంబంధించిన ప్రతీ విషయాన్ని తనే మోయాల్సి ఉంటుంది త్రిష. దీనికి తోడు సత్యం రాజేష్ తో జంటగా నటించేందుకు ఒప్పుకుని త్రిష సాహసం చేసిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అసలు ఈ మూవీలో త్రిష ఎలా ఉంటుందనే మాటలకు కొన్నాళ్ల క్రితం.. మోషన్ పోస్టర్ తో సమాధానం ఇచ్చాడు దర్శకుడు గోవి.

ప్రస్తుతం నాయకికి సంబంధించిన కొన్ని పోస్టర్స్ విడుదలయ్యాయి. త్రిష దెయ్యంగా భయపెట్టేందుకు తెగ ట్రై చేసేస్తోంది. ఒకవైపు ఎక్స్ పోజింగ్ చేస్తూ.. మరోవైపు భయపెట్టేందుకు ప్రయత్నించడం కొంచెం కామెడీగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా త్రిష ఎంత సీరియస్ గా ఉరిమి ఉరిమి చూసినా.. భయపెడుతున్నట్లుగా లేదని అంటున్నారు జనాలు. మరి సినిమాలో త్రిష ఏం చేస్తుందో చూడాల్సిందే!!

,  ,  ,  ,  ,  ,