Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2016 16:08:58
facebook Twitter Googleplus
Photo

త్రిష కథానాయికగా నటించిన చిత్రం ?నాయకి?. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపుదిద్దుకొన్న ఈ చిత్రానికి గోవి దర్శకత్వం వహించారు. గిరిధర్‌ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మాతలు. ఈనెల 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ??ఇప్పుడొస్తున్న హారర్‌, కామెడీ చిత్రాలకు భిన్నంగా సాగే కథ ఇది. నాయకి నవ్విస్తుంది, భయపెడుతుంది. రెట్రో హారర్‌ జోనర్‌ ఎలా ఉంటుందో చూపిస్తున్నాం. చిన్న సినిమాగా మొదలైనా అందరి సహకారంతో పెద్ద సినిమాగా మారింది. త్రిష నటన ప్రత్యేక ఆకర్షణ?? అన్నారు. ??సాంకేతికంగా ఈ సినిమా బాగా వచ్చింది. రఘు కుంచె అందించిన నేపథ్య సంగీతం అందరినీ ఆకట్టుకొంటుంది. త్రిష ఓ పాట పాడార??న్నారు నిర్మాతలు. ఈ కార్యక్రమంలో మల్కాపురం శివకుమార్‌, ఎన్‌.శంకర్‌, రఘుకుంచె తదితరులు పాల్గొన్నారు.

,  ,  ,  ,  ,  ,  ,