Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jun-2016 17:25:58
facebook Twitter Googleplus
Photo

అందాల తార త్రిష తెలుగు, తమిళ్ భాషల్లో దర్శకుడు గోవి దర్శకత్వంలో హర్రర్ చిత్రం గా వస్తున్న `నాయకి` సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే త్రిష ?మధురై? ఫేం ఆర్. మాదేష్ దర్శకత్వంలో మరో హార్రర్ సినిమా చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే.
?మోహిని? గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజు లండన్ లో మొదలైంది. 40 రోజుల పాటు లండన్ లో జరిగే ఈ మొదటి షెడ్యూల్ లో సినిమాలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలిసింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. హారీపోట్టర్‌ చిత్రానికి గ్రాఫిక్స్ సమకూర్చిన వీఎఫ్‌ఎక్స్‌ బృందం ?మోహిని? చిత్రానికి పనిచేస్తుండడం విశేషం. ఈ సినిమాకి మెర్విన్ సోలమన్, వివేక్ సంగీతం అందిస్తుండగా ఆర్ బి గురుదేవ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,