Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-May-2017 14:15:41
facebook Twitter Googleplus
Photo

చెన్నై సోయగం త్రిషా కృష్ణన్ ఇప్పటికి ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లకు పైగా కాలం గడిచిపోయింది. టాప్ స్టార్స్ అందరితోనూ నటించిన రికార్డును త్రిష తన ఖాతాలో వేసేసుకుంది. దశాబ్దంన్నర గడిచిన తర్వాత కూడా ఇంకా తన కెరీర్ ని కొనసాగిస్తూ.. టాప్ హీరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది త్రిష.

తన కుటుంబంతో కలిసి అమెరికా టూర్ వెళ్లిన త్రిష.. అక్కడ సుదీర్ఘమైన కాలం గడిపి రీసెంట్ గా చెన్నై తిరిగి వచ్చింది. ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ కూడా హాజరైన ఈ భామ.. తను మంచి ఫుడ్ లవర్ అంటోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాల గురించి చెబుతూ.. తాను ఈ ఏడాది బోలెడన్ని రిస్కులు చేస్తున్నానని.. ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో అని ఎదురుచూస్తున్నాని చెబుతోంది. తొలిసారిగా మలయాళ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న త్రిష.. నివిన్ పౌలీతో జోడీ కట్టనుంది. జూన్ 1నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఈ మూవీపై తాను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు చెప్పింది .

మరోవైపు సామి2 చిత్రంలో కూడా త్రిష నటించనుంది. 'సీక్వెల్స్ అంటే వరుసగా వస్తుంటాయ్. కానీ ఇది మాత్రం చాలా గ్యాప్ తో వస్తున్న ప్రాజెక్ట్. సామి2కి అదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ ఏడాది గర్జనై.. మోహిని.. చతురంగ వేట్టై2 చిత్రాలను రిలీజ్ కానున్నాయి.

,  ,  ,  ,  ,