Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Jun-2016 10:48:17
facebook Twitter Googleplus
Photo

సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్ సర్వసాధారణం. ఆ సెంటిమెంట్ పాజిటివ్ అయినా కావచ్చు.. లేదంటే నెగెటివ్ అయినా కావచ్చు. యువ కథానాయకుడు నితిన్ కి కూడా అలాంటి ఓ నెగెటివ్ సెంటిమెంట్ ఉంది. అది కాస్త 'అఆ తో బ్రేక్ అయింది. అదేమిటంటే.. తన అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్ తో హిట్ ఇచ్చిన దర్శకులతో సినిమాలు చేస్తే అవి కాస్తా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి. పవన్ తో 'బద్రిస లాంటి హిట్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ తో చేసిన హర్ట్ ఎటాక్ అంతంత మాత్రమే. అలానే పవర్ స్టార్ కి ఎంతో పేరు తెచ్చిన తొలిప్రేమ డైరెక్టర్ కరుణాకరన్ తో చిన్నదానా నీ కోసం ఫ్లాప్ అయింది.

ఈ నేపథ్యంలో పవన్తో 'జల్సా - అత్తారింటికి దారేది' వంటి హిట్ చిత్రాలను రూపొందించిన త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ చేసిన 'అఆ' కూడా అదే బాటలో వెళుతుందని ఇండస్ట్రీ వర్గాలనుకున్నాయి. అయితే ఈ సెంటిమెంట్ ను త్రివిక్రమ్ బ్రేక్ చేశాడు. అన్నట్టు.. గతంలో పవన్కి కూడా 'ఓ సారి హిట్ ఇచ్చిన దర్శకులు మరోసారి కలిసిరారు అనే సెంటిమెంట్ ఉంటే.. దాన్ని కూడా బ్రేక్ చేసిన ఘనత త్రివిక్రమ్ కే దక్కింది. మొత్తానికి గురుశిష్యుల్లాంటి ఇద్దరు కథానాయకులకు ఉన్న నెగెటివ్ సెంటిమెంట్ లను బ్రేక్ చేశాడు త్రివిక్రమ్.

,  ,  ,  ,  ,  ,